Arjun Suravaram
Children Chase Foreigners: ఇద్దరు బాలికలు విదేశీయులను వెంబడించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రన్నింగ్ లో ఉన్న ఆటో ఎక్కి మరీ.. విదేశీయులను ఆ బాలికలు ఫాలో అయ్యారు. ఎందుకంటే...
Children Chase Foreigners: ఇద్దరు బాలికలు విదేశీయులను వెంబడించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రన్నింగ్ లో ఉన్న ఆటో ఎక్కి మరీ.. విదేశీయులను ఆ బాలికలు ఫాలో అయ్యారు. ఎందుకంటే...
Arjun Suravaram
నిత్యం సోషల్ మీడియాలో అనేక రకాల సంఘటనలు మనకు కనిపిస్తుంటాయి. అలానే ప్రపంచంలో ఎక్కడ ఏ సంఘటన జరిగిన క్షణాల్లో ప్రత్యక్షమవుతుంది. ఈ క్రమంలోనే కొన్ని ఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. అలానే మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి. తాజాగా ఇద్దరు చిన్నారులు చేసిన పని అందరినీ షాకి గురి చేస్తుంది. ఆ బాలికలు ఇద్దరూ విదేశీయులను వెంబడించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. టూర్ కోసం ఇండియాకు వచ్చిన విదేశీయులను ఆ బాలికలు వెంటపడ్డారు. దీంతో ఆ ఫారెన్ వ్యక్తులు ఆందోళనకు గురయ్యారు. మరి.. అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ఈ విచిత్ర ఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో చోటుచేసుకుంది. కొందరు విదేశీయులు భారత పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి ఇద్దరు బాలికల నుంచి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. డబ్బులు ఇవ్వాలంటూ ఇద్దరు చిన్నారు విదేశీయులను డిమాండ్ చేశారు. అంతటితో ఆగక..వారు ప్రయాణిస్తున్న ఆటోను ఆ చిన్నారులు వెంబడించారు. గురువారం విదేశీయులు ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఇదే సమయంలో ఆటోలో వెళ్తుండగా భిక్షాటన చేసే ఇద్దరు బాలికలు డబ్బులు ఇవ్వమంటూ వారిని డిమాండ్ చేశారు.
ఇక ఈ సంఘటనలో ఒక బాలిక ఆటో వెనక పరిగెత్తింది. ఇక మరో బాలిక అయితే ఏకంగా రన్నింగ్ లో ఉన్న ఆటోను పట్టుకొని ప్రమాదకరంగా వేలాడింది. అలా ఉంటూ కూడా విదేశీయులను డబ్బులు అడుగుతుంది. ఇక ఆ అమ్మాయిల చర్యలతో పర్యటకులు ఒకింత ఆందోళన, అసహనంకి గురయ్యారు. ఆ బాలికలు తమ వెంటబడిన దృశ్యాలను వారు వీడియోలో రికార్డు చేశారు. అంతేకాక ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ..ఇది చాలా దారుణమని, ఏం జరుగుతుందో నమ్మలేకపోతున్నామని ఓ పర్యటకుడు అంసతృప్తిని వ్యక్తం చేశారు.
అయితే విదేశీయుల ఆందోళనను, బాలికలు వెంబడించడాన్ని పట్టించుకోకుండా ఆ డ్రైవర్ అలాగే ఆటోను నడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు ఢిల్లీలో సర్వసాధారణమే అన్నట్లు అతడి వైఖరి ఉండటం విదేశీయులను విస్తుగొలుపుతోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. మొత్తంగా ప్రపంచం దేశాలను పట్టి పీడిస్తున్న వాటిల్లో పేదరికం ఒకటని, దాని కారణంగానే పిల్లలు ఇలా ప్రవర్తించి ఉంటారని పలువురు అభిప్రాయా పడ్డారు. మరి.. ఈ వీడియోను మీరు వీక్షించింది..మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Typical concern of every foreign tourist visiting Delhi, India. pic.twitter.com/l1Ihr39e1s
— Indian Tech & Infra (@IndianTechGuide) July 18, 2024