దీపావళికి టపాసులు కాల్చిన 554 మందిపై కేసు నమోదు! ఎక్కడంటే?

  • Author Soma Sekhar Published - 12:17 PM, Mon - 13 November 23

దీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చిన 554 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే?

దీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చిన 554 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందంటే?

  • Author Soma Sekhar Published - 12:17 PM, Mon - 13 November 23

భారతదేశంలో పండగలకు ఉన్న విశిష్టతల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారతీయులు ప్రతీ పండగను ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారు. తాజాగా దేశవ్యాప్తంగా దీపావళి పండగను జరుపుకున్నారు ప్రజలు. ఈ వేడుకలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి ఎంజాయ్ చేశారు. అయితే దీపావళి పండగ సందర్భంగా బాంబులు కాల్చినవారికి షాకిచ్చారు పోలీసులు. నిర్దేశించిన టైమ్ లో కాకుండా.. ఇతర సమయంలో టపాసులు కాల్చిన 554 మందిపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

దీపావళి.. అంటేనే బాంబుల మోత. కుర్రాళ్ల దగ్గర నుంచి ముసలోళ్ల వరకు బాంబులు కాల్చుతూ.. ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా ఆదివారం నాడు దీపావళి పండగ సందర్భంగా టపాసులు కాల్చిన వారికి ఊహించని షాకిచ్చారు పోలీసులు. దేశంలో కాలుష్యం పెరిగిపోతుండటంతో.. ఈ దీపావళికి సుప్రీం కోర్టు టపాసులు కాల్చడానికి ఓ టైమ్ ను నిర్దేశించింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, మళ్లీ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు కేవలం 2 గంటలు మాత్రమే బాంబులు కాల్చాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సర్వోన్నత న్యాయస్థానం పర్మిషన్ ఇచ్చిన సమయంలో కాకుండా ఇతర టైమ్ లో బాణాసంచా పేల్చిన 554 మందిపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు.

కాగా.. ఈనెల 11 నుంచి 13 వరకు తనిఖీలు చేసి.. కేసులు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. దేశంలో పెరిగిపోతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీం కోర్టు టపాసులు కాల్చడంపై నిబంధనలు విధించింది. అయితే కొన్ని ప్రాంతాల్లో వాటికి విరుద్ధంగా, ఇష్టానుసారంగా బాణాసంచా కాలుస్తూ.. పర్యావరణానికి హాని చేస్తున్నారు కొందరు. మరి టపాసులు కాల్చిన 554 మందిపై కేసులు నమోదు చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments