iDreamPost
android-app
ios-app

దేశంలోనే తొలిసారి.. డ్రైవర్ లేకుండా మెట్రో రైళ్లు! ఫస్ట్ ఎక్కడంటే?

  • Author Soma Sekhar Published - 05:00 PM, Thu - 13 July 23
  • Author Soma Sekhar Published - 05:00 PM, Thu - 13 July 23
దేశంలోనే తొలిసారి.. డ్రైవర్ లేకుండా మెట్రో రైళ్లు! ఫస్ట్ ఎక్కడంటే?

దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు మెట్రో రైళ్ల ద్వారా పరిష్కారం చూపాయి ప్రభుత్వాలు. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి మెట్రో రైళ్లు. తాజాగా రైల్వే హిస్టరీలోనే కీలక ఘట్టానికి నాంది పలకనుంది ఇండియన్ రైల్వేస్. ఇప్పటికే ప్రయాణికుల అవసరాలకు తగినట్లుగా సరికొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది. తాజాగా మరో మరో ఘనతను చేరుకోబోతోంది ఇండియన్ మెట్రో. దేశంలోనే మెుదటి సారిగా డ్రైవర్ లేకుండా మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ డ్రైవర్ లెస్ ట్రైన్లు అందుబాటులోకి వస్తే.. ఇండియన్ రైల్వే చరిత్రలో అదొక మైలురాయి అవుతుంది. ఇంతకీ ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైళ్లను ఫస్ట్ ఎక్కడి నుంచి నడుపుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మెట్రో రైళ్లు.. ఉద్యోగుల పాలిట వరంలా మారాయి. కరెక్ట్ టైమ్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సర్వీస్ ను ప్రజలకు అందిస్తోంది మెట్రో. ఇక మెట్రో సర్వీసుల్లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త టెక్నాలజీని పరిచయం చేస్తూనే వస్తుంది ఇండియన్ రైల్వేస్. తాజాగా మరో అడుగు ముందుకేసి.. దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లేకుండా మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించింది. చెన్నై మెట్రో రైలు లిమిటెడ్(CMRL) దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ లేకుండా మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఇదే కనుక జరిగితే భారతీయ రైల్వే చరిత్రలో ఇది ఓ అద్భుత ఘట్టం అవుతుంది.

కాగా.. CMRL త్వరలోనే ప్రారంభించనున్న ఫేజ్ 2 ప్రాజెక్ట్ లో డ్రైవర్ లేకుండా నడిచే మెట్రో రైళ్లను పరిచయం చేయాలని భావిస్తోంది. అదీకాక ఈ ప్రాజెక్ట్ ద్వారా మెట్రో వ్యవస్థ 116 కిలోమిటర్లు పెరగనుంది. తొలుత ఇది 118.9 కిలోమిటర్లు విస్తరించాలని ప్లాన్ చేయగా.. కొన్ని కారణాల వల్ల దీన్ని తగ్గించారు. ఈ ప్రాజెక్ట్ ను 2026లోగా ప్రారంభించాలని చెన్నై మెట్రో సిస్టమ్ భావిస్తోంది. ఇందుకు సుమారు రూ. 61,843 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఫేజ్ 2 ప్రాజెక్ట్ ద్వారా 118 కొత్త స్టేషన్లు రానున్నాయి.

ఇక ఈ తరహా డ్రైవర్ లెస్ మెట్రో రైళ్లను వినియోగంలోకి తేవడానికి ముందు.. సంవత్సరం పాటు టెస్ట్ చేయనున్నారు. ఈ ట్రైన్స్ వాటికి అందే సిగ్నల్స్ ఆధారంగా పనిచేస్తాయి. అందుబాటులోకి వచ్చిన సంవత్సరంలోగా ఏవైనా సమస్యలు వస్తే.. అత్యవసర పరిస్థితులను మేనేజ్ చేయడానికి రైళ్లలో అటెండర్లు ఉంటారని సీఎమ్ఆర్ఎల్ డైరెక్టర్ రాజేష్ చతుర్వేది తెలిపారు. మరి ఈ డ్రైవర్ లెస్ మెట్రో రైళ్లు రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: సగం కాలిన శవాన్ని తిన్న మందుబాబులు.. భయాందోళనలో ప్రజలు!