రెక్కల పురుగులతో వ్యాపిస్తున్న వైరస్.. నలుగురు చిన్నారులు మృతి

ప్రస్తుతం వర్షకాలం కావడంతో సాధారణంగా ఈ సీజన్ లో దోమలు, పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ తో పాటు మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తాయని అందరికి తెలిసిందే. కానీ, తాజాగా  దోమలు, రెక్క పురుగులు  ద్వారా కొత్తగా ఈ చాందిపుర అనే వైరస్ సోకుంతుందట. మరి, ఈ వ్యాధి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం వర్షకాలం కావడంతో సాధారణంగా ఈ సీజన్ లో దోమలు, పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ తో పాటు మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తాయని అందరికి తెలిసిందే. కానీ, తాజాగా  దోమలు, రెక్క పురుగులు  ద్వారా కొత్తగా ఈ చాందిపుర అనే వైరస్ సోకుంతుందట. మరి, ఈ వ్యాధి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గత రెండు సంవత్సరాల క్రితం  కరోనా మహామ్మారి విజృంభణతో ప్రపంచ వ్యాప్తంగా అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా లక్షాలది మంది ప్రజలు ఈ కోవిడ్ వైరస్ సోకి మరణించారు. కాగా, ఇప్పటికే ఈ వ్యాధి గురించి మాట్లాడుకోవడానికే అందరూ భయపడుతుంటారు. అంతలా ఈ మహామ్మరి ప్రపంచ దేశాలను కాటు వేసింది. ఇక ఈ వైరస్ వచ్చిన తర్వాత నుంచి వరుసగా దేశంలో రకరకాల వైరస్ పుట్టుకు వస్తున్నాయి. అసలు ఏ వైరస్ ఎందువల్ల వస్తుందో కనిపెట్టడానికే కష్టంగా మారుతుంది. తరుచు రకరకాల వైరస్ లతో దేశంలోనే కాకుండా.. ప్రపంచ దేశల్లోనూ చాలామంది ప్రజలు మరణిస్తున్నారు. కాగా, మొన్న మొన్నటి వరకు కరోనా, ఇక ఇటీవలే బ్రేయిన్ ఈటింగ్ అమిబా వైరస్ లు వ్యాపిస్తూ ప్రజలు ప్రాణాలు  పోగొట్టుకోవడమే కాకుండా.. తాజాగా మరో కొత్త వైరస్ అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ఈ వైరస్ దోమలు , పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. మరి, ఆ వివరాలేంటో చూద్దాం.

ప్రస్తుతం వర్షకాలం కావడంతో సాధారణంగా ఈ సీజన్ లో దోమలు, పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అయితే దోమలు కుడితే వైరల్ ఫీవర్స్ తో పాటు మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తాయని అందరికి తెలిసిందే. కానీ, తాజాగా  దోమలు, రెక్క పురుగులు  ద్వారా కొత్తగా ఈ చాందిపుర అనే వైరస్ సోకుంతుందట. ఇక ఈ వైరస్ ఇప్పటికే గుజరాత్ లో నలుగురు పిల్లల్ని బలితీసుకుంది. ముఖ్యంగా.. స‌బ‌ర్‌కాంతా జిల్లాలో చాందిపుర వైర‌స్ సోకి న‌లుగురు చిన్నారులు మృతిచెందారు. ఇకపోతే ప్రస్తుతం హిమ‌త్‌న‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో మ‌రో ఇద్దరు పిల్లలు చాందిపుర వైరస్ కు ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.

అయితే ఈ చాందిపుర వైరస్ సోకిన వారిలో ఎక్కువగా జ్వరం లక్షణాలు కనిపిస్తాయట. ఇక ఆ వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే తీవ్ర స్థాయిలో ఇన్‌సెఫ‌లైటిస్ కూడా వ‌స్తుంది. అలాగే ఆరుగురు చిన్నారుల‌కు బ్లడ్ శాంపిల్స్ ను పుణెలోని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీకి పంపారు. పైగా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు స‌బ‌ర్‌కాంత జిల్లా ఆరోగ్యశాఖ అధికారి రాజ్ సుతారియా తెలిపారు.  ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఇద్దరు కూడా రాజస్థాన్ కు చెందిన పిల్లలు కావడమే గమన్హారం.

చాందిపుర వైరస్ లక్షణాలు

  • మొదటగా తలనొప్పి తో పాటు ఆకస్మిక అధిక జ్వరం
  • మూర్ఛ
  • వాంతులు, వికారం
  • అపస్మారక స్థితి
  • ఇక వైరస్ ప్రధానంగా 2-16 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలకు సోకుతుంది.
  • అలాగే వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలు కూడా ఉంటాయి.
  • అయితే ఇసుక ఈగ కాటు ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది.
  • అలాగే కొన్ని సందర్భాల్లో వర్షకాలం దోమల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
  • ఇక ఈ వ్యాధి సోకితే  55-75 శాతం మధ్య మరణాలు సంభవించే అవకాశం ఉందని వైద్య నిపుణులు తెలిపారు.
Show comments