Lakshadweep: లక్షద్వీప్‌పై మోదీ మాస్టర్‌ ప్లాన్‌.. కేంద్రం కీలక నిర్ణయం

లక్షద్వీప్‌ పేరు మారుమోగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆ వివరాలు..

లక్షద్వీప్‌ పేరు మారుమోగిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఆ వివరాలు..

మాల్దీవుల వివాదం కారణంగా గత కొన్ని రోజులుగా లక్షద్వీప్‌ పేరు వార్తల్లో మారుమోగతుంది. సెలబ్రిటీలు అంతా మాల్దీవ్స్‌కు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. అంతేకాక మన దేశంలోనే మాల్దీవ్స్‌ కన్నా మంచి పర్యటక ప్రదేశాలున్నాయని.. సరిగ్గా డెవలప్‌ చేస్తే.. లక్షద్వీప్‌ పర్యాటకానికి హాట్ స్పాట్‌గా మారుతుంది అనే అభిప్రాయం వినిపిస్తోంది. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో చేపట్టిన పర్యటన తర్వాత.. దేశీయ పర్యాటకుల్లో ఆ దీవుల సముదాయంపై ఆసక్తి పెరిగింది. మాల్దీవులతో వివాదం, లక్షద్వీప్‌పై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. మోదీ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఆ వివరాలు..

కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యుద్ధ విమానాలతోపాటు వాణిజ్య విమాన సర్వీసులను సైతం నడిపేందుకు వీలైన విమానాశ్రయాన్ని లక్షద్వీప్‌లోని మినికాయ్‌ దీవిలో నిర్మిస్తే బాగుంటుందని కేంద్రం భావిస్తోందట. లక్షద్వీప్‌, మినికాయ్‌ దీవిలో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే రక్షణ శాఖ కేంద్రానికి ప్రతిపాదన పంపింది. అయితే ఇటీవలి పరిణామాల నేపథ్యంలో మినికాయ్‌లో సైనిక, పౌర అవసరాలకు సైతం సరిపోయేలా విమానాశ్రాయాన్ని నిర్మించే సరికొత్త ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని అధికారవర్గాలు వెల్లడించాయి.

అంతేకాక ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణం వల్ల అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల బేస్‌గా, పెరుగుతున్న సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు చెక్‌ పెట్టేందుకు వీలవుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది. అంతేకాక మినికాయ్‌లో విమానాశ్రయం నిర్మిస్తే.. అది అరేబియా సముద్రంపై నిఘాను మరింత విస్తృతం చేసుకునేందుకు వైమానిక దళానికి ఎంతగానో ఉపయోగపడనుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం లక్షద్వీప్‌ మొత్తంలో ఒకే ఒక్క విమానాశ్రయం అగట్టిలో ఉంది. ఇక్కడ కేవలం చిన్న విమానాలు మాత్రమే ల్యాండ్‌ అయ్యేందుకు అవకాశం ఉంది.

ఈక్రమంలో ఒకవేళ మినికాయ్‌ దీవిలో విమానాశ్రయం అందుబాటులోకి వస్తే పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు భద్రతపరంగా కూడా బాగుంటుందనే అభిప్రాయం వెల్లడవుతోంది. మరోవైపు, భారత్‌తో వివాదం తమకు భారీగా నష్టం చేసేలా కన్పిస్తున్న నేపథ్యంలో మాల్దీవులకు చెందిన పర్యాటక సంస్థలు రంగంలోకి దిగాయి. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన తమ మంత్రులు ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు పేర్కొన్నాయి.

Show comments