iDreamPost
android-app
ios-app

రైతులకు కేంద్రం శుభవార్త.. ఆ పంట ఎగుమతులపై నిషేధం ఎత్తివేత!

Onion Crop: లోక్ సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Onion Crop: లోక్ సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మోదీ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

రైతులకు కేంద్రం శుభవార్త.. ఆ పంట ఎగుమతులపై నిషేధం ఎత్తివేత!

కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగ, రైతుల అభివృద్ధి కోసం అనేక రకాల సంస్కరణలు, స్కీమ్స్ తీసుకొచ్చింది. రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మోదీ సర్కార్ పలు పథకాలను ప్రారంభించింది. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ యోజన్ స్కీమ్ తో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోంది. తరచూ రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. తాజాగా మోడీ ప్రభుత్వం ఓ  పంట విషయంలో రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ప్రస్తుతం భారత దేశంలో లోక్ సభ ఎన్నికల హడావుడి కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడతల్లో  పోలింగ్ పూర్తైంది. మరో ఐదు విడుతల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఇలా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా రైతుల విషయంలో ఓ కీలక నిర్ణయాన్ని మోదీ సర్కార్ తీసుకుంది. ఇది ఉల్లిని పండించే రైతులకు శుభవార్తే అని చెప్పొచ్చు. ఉల్లి ఎగుమతలుపై నిషేధాన్ని ఎత్తివేసింది. విదేశాలకు లక్ష టన్నులకు పైగా ఉల్లి ఎగుమతులకు కేంద్ర అనుమతి ఇచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, బహ్రెయిన్, మారిషస్, యూఏఈ లకు ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది.

తాజాగా ఆదేశాలపై ఉన్న ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటితో పాటు మధ్య ఆసియా, ఐరోపా దేశాలకు మరో 2 వేల టన్నుల తెల్లరకం ఉల్లిని ఎగుమతి చేసేందుకు కూడా కేంద్రం పర్మిషన్ ఇచ్చింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం 5 నెలల పాటు అమల్లో ఉంటుందని వెల్లడించారు. 2023-24లో ఖరీఫ్, రబీలో ఉల్లి పంట దిగుబడి తగ్గింది. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ఉల్లికి డిమాండ్ పెరిగింది. దీంతో గత ఏడాది డిసెంబర్ 8వ తేదీన కేంద్రం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. తాజాగా ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తి వేసింది. మరి.. కేంద్రం  తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి  రైతులకు లాభం చేకూరుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.