Accidents: కేంద్రం సరికొత్త ప్లాన్‌.. ఇక రోడ్డు ప్రమాదాలకు చెక్‌.. వారి కోసం ప్రత్యేకంగా

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీని ద్వారా ప్రమాదాలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఆ వివరాలు..

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దీని ద్వారా ప్రమాదాలకు చెక్‌ పెట్టాలని భావిస్తోంది. ఆ వివరాలు..

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మద్యం మత్తు, అతివేగం.. కారణాలు ఏవైనా సరే.. ప్రమాదాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సెలబ్రిటీలు ఎన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా.. జాగ్రత్తలు చెప్పినా.. కొందరిలో అసలే మార్పు రావడం లేదు. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జీవితాలే నాశనం అవుతున్నాయి. ఎందరో చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నారు. ఈ క్రమంలో దేశంలో అంతకంతకూ పెరుగుతున్న ప్రమాదాలను నివారించడం కోసం.. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల టూ వీలర్స్‌కు సంబంధించిన ప్రమాదాలకు చెక్‌ పెట్టేందుకు మార్గం సుగమం కానుంది. ఆ వివరాలు..

టూవీలర్స్‌ వల్ల చోటు చేసుకుంటున్న ప్రమాదాలను నివారించేందుకు.. వాటిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు కేంద్ర రోడ్డు​ రవాణా మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రణాళిక​ రూపొందిస్తుంది. దీనిలో భాగంగా.. నగరాల్లో ద్విచక్ర వాహనాలు, పాదచారుల కోసం ప్రత్యేక లేన్లు, అండర్‌పాస్‌లు, ఓవర్‌బ్రిడ్జీలను నిర్మించేందుకు రెడీ అవుతుంది. రోడ్డు మీద అన్ని రకాల వాహనాలు ఏకకాలంలో వెళ్లడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని.. మంత్రిత్ర శాఖ చెబుతోంది. వీటిని అరికట్టేందుకు.. వాహనాల రకాన్ని బట్టి.. వేర్వేరు లేన్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా ప్రమాదలను చాలా వరకు తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ప్రతి ఏటా సంభవిస్తోన్న రోడ్డు ప్రమాదాలు, మరణాలలో 44 శాతం దారుణాలు ద్విచక్ర వాహనాల వల్లే సంభవిస్తున్నాయి అని తేలింది. అంతేకాక రోడ్డు ప్రమాదాల వల్ల అత్యధిక మరణాలు సంభవించే దేశాల జాబితాలో భారత్‌ ముందు వరుసలో ఉందని నివేదికలు వెల్లడించాయి. రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక ప్రకారం.. 2022లో దేశవ్యాప్తంగా 4,61,312 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. వీటిల్లో 1,68,491 మంది మృత్యువాత పడగా.. 4,43366 మంది గాయపడ్డారు. ఇక గత ఏడాది దేశంలో సగటున ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు, 19 మరణాలు సంభవించాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటి కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం టూవీలర్స్‌ కోసం ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతోంది.

Show comments