iDreamPost
android-app
ios-app

నెల నెలా వారికి 10 వేలు.. 2024 బడ్జెట్‌లో కీలక ప్రకటన వచ్చేది ఆరోజే?

Monthly 10K: ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తుంది. అయితే పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, ఇతర ధరలు వంటి వాటి వల్ల సామాన్యుల జీవితం మీద భారం పడుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 5 వేలు ఇచ్చే ఆ పథకాన్ని 10 వేలకు పెంచాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Monthly 10K: ఆర్థికంగా వెనుకబడిన వారి అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తుంది. అయితే పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, ఇతర ధరలు వంటి వాటి వల్ల సామాన్యుల జీవితం మీద భారం పడుతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని 5 వేలు ఇచ్చే ఆ పథకాన్ని 10 వేలకు పెంచాలని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

నెల నెలా వారికి 10 వేలు.. 2024 బడ్జెట్‌లో కీలక ప్రకటన వచ్చేది ఆరోజే?

ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. పెరుగుతున్న నిత్యావసర ధరలు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని పథకం ప్రయోజనాలను కూడా పెంచుతూ ఉంటాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ నెలకు 5 వేల రూపాయలు ఇస్తూ వచ్చిన కేంద్రం.. ఇక నుంచి వారికి ప్రతి నెలా 10 వేలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయనుంది. జూలై 23న కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఈ 10 వేలకు సంబంధించి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 

కేంద్ర ప్రభుత్వం అందించే పథకాల్లో అటల్ పెన్షన్ యోజన పథకం ఒకటి. ఈ పథకంలో కేంద్రం కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కేంద్రం చేయబోయే ఈ కీలక మార్పులతో ఈ పథకం లబ్ధిదారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా ప్రతి నెలా లబ్ధిదారులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఈ అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నెలా ఇస్తున్న 5 వేల రూపాయల పెన్షన్ ను 10 వేల రూపాయలకు పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం 2015 బడ్జెట్ లో కేంద్రం అటల్ పెన్షన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. నెలకు వెయ్యి రూపాయల నుంచి 5 వేల వరకూ పెన్షన్ అందుకునే వెసులుబాటు కల్పించింది. ఈ పథకంలో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. ప్రతి నెలా చెల్లించే ప్రీమియం మీద విరమణ తర్వాత వచ్చే ఆదాయం ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం 6.62 కోట్ల మంది ఈ పథకంలో చేరి ఉన్నారు. 2023-24 ఆర్థిక ఏడాదిలో ఏకంగా 1.22 కోట్ల మంది చేరారు. అటల్ పెన్షన్ యోజన పథకం ప్రారంభమైన తర్వాత 2023-24లో ఎక్కువ మంది ఈ పథకంలో చేరినట్లు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ దీపక్ మొహంతి పేర్కొన్నారు.

అలానే ఈ పథకం ద్వారా ప్రస్తుతం అందిస్తున్న పెన్షన్ డబ్బు ఏదైతే ఉందో అది.. భవిష్యత్తు అవసరాలకు సరిపోదని.. దాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఇటీవలే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అటల్ పెన్షన్ యోజన పథకం ప్రయోజనాలను పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. జూలై 23న దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి