భారీ షాకిచ్చిన కేంద్రం.. 55 లక్షల ఫోన్‌ నంబర్లు రద్దు.. మీ నంబర్ ఉందేమో చెక్ చేసుకొండి

కేంద్ర ప్రభుత్వం తాజాగా భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా 55 లక్షల ఫోన్ నంబర్లను రద్దు చేసింది. కారణం ఏంటంటే..

కేంద్ర ప్రభుత్వం తాజాగా భారీ షాకిచ్చింది. దేశవ్యాప్తంగా 55 లక్షల ఫోన్ నంబర్లను రద్దు చేసింది. కారణం ఏంటంటే..

దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ప్రస్తుతం మన దేశంలో ఫోన్ లేని కుటుంబం లేదంటే అతిశయోక్తి కాదు. ఆఖరికి రోడ్ల వెంట నివసించే వారికి దగ్గర సైతం ఫోన్ ఉంటుంది. అది కూడా స్మార్ట్ ఫోన్. మొబైల్ అనేది మన జీవితంలో భాగం అయ్యింది. ఇక చాలా మంది రెండు, మూడు ఫోన్లు వాడుతుంటారు. అందుకు తగ్గట్టుగానే సిమ్ కార్డులు తీసుకుంటారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 55 లక్షల ఫోన్ నంబర్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇలా రద్దు చేసిన నంబర్లలో మీ ఫోన్ నంబర్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకొండి. మరి ఇంతకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది అంటే..

దేశవ్యాప్తంగా సుమారు 55 లక్షల ఫోన్ నంబర్లను రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం. కారణం తప్పుడు పత్రాలతో సిమ్ కార్డులు పొందడం. నకిలీ ధృవపత్రాలతో పొందిన 55 లక్షల ఫోన్ నెంబర్లను కేంద్రం తాజాగా రద్దు చేసింది. దీని కోసం కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా సంచార్ సాథీ పేరిట దేశవ్యాప్తంగా మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

అక్రమ మార్గాల్లో పొందిన సిమ్ కార్డుల ద్వారా సైబర్ నేరాలు, ఇతర నేరాలు, మోసాలకు పాల్పడకుండా అడ్డుకోవడమే సంచార్ సాథీ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా లక్షలాది సిమ్ కార్డులకు సరైన ధృవపత్రాలు లేవని గుర్తించారు అధికారులు. వాటిని రద్దు చేసే పనిలో ఉన్నారు.

అంతేకాక తప్పుడు పత్రాలతో పొందిన సిమ్ కార్డులపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా నకిలీ ధృవపత్రాలతో పొందిన 55 లక్షల ఫోన్ నెంబర్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దేవుసింహ్ చౌహాన్ పార్లమెంటులో ఈ విషయం వెల్లడించారు.

భారీ ఎత్తున ఫోన్ నంబర్ వెరిఫికేషన్ కార్యక్రమం చేపట్టామని, తప్పుడు ధృవపత్రాలతో పొందిన 55.52 లక్షల సిమ్ కార్డులను డీయాక్టివేట్ చేసినట్టు ఈ సందర్భంగా మంత్రి దేవుసింహ్ చౌహా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా, సైబర్ నేరాలకు ఉపయోగించిన 1.32 లక్షల మొబైల్ ఫోన్లను కూడా బ్లాక్ చేసినట్టు వివరించారు. దాంతోపాటే, పౌరుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పదంగా ఉన్న 13.42 లక్షల ఫోన్ కనెక్షన్లను కూడా నిలిపివేసినట్టు తెలిపారు.

Show comments