nagidream
గతుకు రోడ్ల మీద ప్రయాణం చేసేవారికి తెలుస్తుంది ఆ బాధ. గుంతల్లో పడితే తెలుస్తుంది ఆ బాధ. వాన పడితే గుంతలు పడేలా మనోళ్లు అంత వీక్ గా ఎలా తయారు చేస్తున్నారు అని అనిపించకుండా ఉండేలా ఇక నుంచి స్ట్రాంగ్ రోడ్లను నిర్మించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకసారి వేస్తే 80 ఏళ్ళు మన్నేలా రోడ్లను వేయడానికి సిద్ధమవుతోంది.
గతుకు రోడ్ల మీద ప్రయాణం చేసేవారికి తెలుస్తుంది ఆ బాధ. గుంతల్లో పడితే తెలుస్తుంది ఆ బాధ. వాన పడితే గుంతలు పడేలా మనోళ్లు అంత వీక్ గా ఎలా తయారు చేస్తున్నారు అని అనిపించకుండా ఉండేలా ఇక నుంచి స్ట్రాంగ్ రోడ్లను నిర్మించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఒకసారి వేస్తే 80 ఏళ్ళు మన్నేలా రోడ్లను వేయడానికి సిద్ధమవుతోంది.
nagidream
భారీ వర్షాల కారణంగా రోడ్లు పాడవుతూ ఉంటాయి. రోడ్ల మీద గతుకులు పడడం అనేది మామూలే. అయితే రోడ్ల మరమ్మత్తులు చేయడం అంటే అంత ఆషామాషీ కాదు. పలు కారణాల వల్ల రోడ్ల మీద గుంతలను పూడ్చడం అనేది ఆలస్యమవుతుంది. ఈలోపు గుంతల్లో పడి చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతల వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంతలు పడ్డా ఆటోమేటిక్ గా పూడ్చుకుపోయే టెక్నాలజీని పరిశీలిస్తుంది. ఇప్పటికే నెదర్లాండ్స్ సహా అనేక దేశాల్లో సెల్ఫ్ హీలింగ్ రోడ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఈ టెక్నాలజీని మన దేశంలో ప్రవేశపెట్టాలని.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా భావిస్తుంది.
ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత ఖర్చు అవుతుంది? దీని వల్ల ప్రయోజనాలు ఏంటి అనే అంశాల మీద చర్చించేందుకు సిద్ధమైంది. చర్చలు సఫలం అయితే ఈ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుంది. హైవేల మీద గుంతల కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని.. దీని వల్ల ఎంతోమంది చనిపోతున్నారని.. అందుకే ఈ టెక్నాలజీని తీసుకురావాలని కేంద్రం భావిస్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఈ రోడ్లను వేయడానికి డాంబర్ ను వాడతారు. ఇసుక, చిన్న ఉక్కు తీగలు, చిన్న కంకర రాళ్లు, డాంబర్ ని కలిపి రోడ్లు వేస్తారు. ఎప్పుడైనా రోడ్ల మీద పగుళ్లు ఏర్పడితే ఈ డాంబర్ కరిగిపోయి పగుళ్ళను పూడ్చేస్తుంది. ఆ పగుళ్లు పెద్దవై గుంతలు ఏర్పడినా కూడా ఉక్కు తీగలతో సహా ఆ డాంబర్ పూర్తిగా గుంతలో పడి పూర్తిగా విస్తరిస్తుంది.
సాధారణ బీటీ రోడ్లతో పోలిస్తే ఈ రోడ్లు ఎక్కువ కాలం మన్నుతాయి. ఒకసారి వేస్తే ఏకంగా 80 ఏళ్ల వరకూ కూడా మన్నుతాయని చెబుతున్నారు. అయితే ఈ డాంబర్ రోడ్లకు ఖర్చు ఎక్కువే అవుతుంది. ఈ సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీని నెదర్లాండ్స్ లోని డెల్ట్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ డెవలప్ చేశారు. ఎరిక్ ష్కాలంగెన్ ఈ టెక్నాలజీతో అక్కడ 12 రోడ్లను నిర్మించారు. అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం గమనార్హం. ప్రత్యేకించి రిపేర్లు చేయడం లాంటి కాన్సెప్టులు లేకుండా వాటికవే సెల్ఫ్ రిపేర్ చేసుకుంటున్నాయి. ఈ టెక్నాలజీ ఆధారంగా బ్రిటన్ లో కూడా పలు యూనివర్సిటీ లు సెల్ఫ్ హీలింగ్ కాంక్రీట్ తో రోడ్లను నిర్మించే పనిలో పడ్డాయి. మరి ఈ టెక్నాలజీతో కూడిన రోడ్లు వేసేందుకు కేంద్రం ఫోకస్ చేయడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.