iDreamPost
android-app
ios-app

రైతుల కోసం కేంద్రం సూపర్ స్కీం.. 2 లక్షలు పొందే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

  • Published Jun 06, 2024 | 10:59 AM Updated Updated Jun 06, 2024 | 10:59 AM

రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం సూపర్ స్కీంను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 2 లక్షలు పొందే ఛాన్స్ కల్సిస్తోంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం సూపర్ స్కీంను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా 2 లక్షలు పొందే ఛాన్స్ కల్సిస్తోంది. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

రైతుల కోసం కేంద్రం సూపర్ స్కీం.. 2 లక్షలు పొందే ఛాన్స్.. ఇలా దరఖాస్తు చేసుకోండి

దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వినూత్నమైన పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, చీడపీడల వల్ల పంటల దిగుబడి సరిగా రాక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. అకాల వర్షాలు కూడా రైతులను ముంచేస్తున్నాయి. ఇలాంటి సందర్భాల్లో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఆర్థికసాయాన్ని అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పంటపెట్టుబడిసాయం కింద రైతులకు ఏడాదికి 6 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే వ్యవసాయంతో పాటు అనుబంధరంగాల్లో కూడా రైతులు దృష్టిసారిస్తే లాభదాయకంగా ఉంటుందని అందుకోసం సాయం అందించేందుకు ప్రభుత్వం సూపర్ స్కీం ను తీసుకొచ్చింది. ఈ పథకంతో రైతులు 2 లక్షలు పొందొచ్చు. ఎలా అంటే?

రైతులకు పాడిపరిశ్రమ మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. అయితే ఇందుకోసం మేలైన జాతి పశువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వాటికి పశువుల షెడ్ ను నిర్మించుకోవాలి. ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే పాడిపరిశ్రమ నెలకొల్పాలనుకునే వారు బయట ఎక్కడో అప్పులు, లోన్స్ తెచ్చుకోవడం కంటే ప్రభుత్వ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వం మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం ద్వరా రైతులకు పశువుల పాక నిర్మాణం కోసం రెండు లక్షల వరకు ఆర్థికసాయాన్ని అందిస్తున్నది. ఎంఎన్ఆర్ఈజీఏ పథకంలో భాగంగా పాడి రైతులు పశువుల షెడ్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం 2 లక్షల వరకు సాయం అందించి, దానిపై సబ్సిడీ కూడా ఇస్తోంది.

పశుపోషణను, రైతులకు ఆదాయ మార్గాలను కల్పించేందుకు ప్రభుత్వం ఈ స్కీం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నది. ఈ పథకం పూర్తి సమాచారం కోసం గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించాల్సి ఉంటుంది. పశుపోషణపై ఆసక్తి ఉన్న వ్యక్తులు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు సమీప బ్యాంకుకు వెళ్లి ఆన్ లైన్ లో అప్లికేషన్ ఫారమ్ ను పూరిచాల్సి ఉంటుంది. మీ వివరాలన్నింటినీ నమోదు చేసుకోవాలి. కావాల్సిన డాక్యూమెంట్స్ ను సబ్మిట్ చేయాలి. అధికారులు మీ దరఖాస్తును పరిశీలించిన అనంతరం ఎంఎన్ఆర్ఈజీఏ పథకం కింద 2 లక్షలు మంజూరు చేస్తారు.