iDreamPost

కేంద్రం నుంచి సరికొత్త OTT ప్లాట్ ఫామ్.. ప్రజలకు ఉచితంగా!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య, పేద ప్రజల కోసం సరికొత్త ఓటీటీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఉచితంగా కంటెంట్ చూసేలా ఈ ఓటీటీని తీసుకొస్తామని కూడా తెలిపింది. అయితే ఎన్నేళ్లు ఉచితంగా చూడచ్చు అంటే?  

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య, పేద ప్రజల కోసం సరికొత్త ఓటీటీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఉచితంగా కంటెంట్ చూసేలా ఈ ఓటీటీని తీసుకొస్తామని కూడా తెలిపింది. అయితే ఎన్నేళ్లు ఉచితంగా చూడచ్చు అంటే?  

కేంద్రం నుంచి సరికొత్త OTT ప్లాట్ ఫామ్.. ప్రజలకు ఉచితంగా!

ఓటీటీ వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్ లు చూసేవారు ఎక్కవయ్యారు. థియేటర్ లో ఒక్కరు చూసే సినిమాని అదే డబ్బులతో ఇంట్లో అందరూ కలిసి చూస్తున్నారు. సామాన్యులకు ఇది ఒక రకంగా ప్రయోజకరమనే చెప్పాలి. అయితే ఈ ఓటీటీలు ఎక్కువయ్యేసరికి ఒక్కో దాంట్లో ఒక్కో సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో అన్ని ఓటీటీలకు సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల ఛార్జీలు ఎక్కువైపోతున్నాయి. మరోవైపు ఆయా ఓటీటీల సబ్ స్క్రిప్షన్ ఛార్జీలు కూడా కాస్త ఎక్కువే. పేదలు, సామాన్యులు భరించలేని విధంగా ఉంటాయి ఆ ఛార్జీలు. ఈ విషయం పక్కన పెడితే ఇంట్లో అందరూ కలిసి చూసే విధంగా ఈ ఓటీటీ కంటెంట్ ఉండడం లేదు. మంచి మంచి సినిమాలతో పాటు అశ్లీల కంటెంట్ కూడా గంపగుత్తగా వచ్చేస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఈ అశ్లీల వెబ్ సిరీస్ లు మరీ ఎక్కువయ్యాయన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. అయితే వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రజల కోసం ప్రభుత్వ ఓటీటీ ప్లాట్ ఫామ్ ని అందించాలని నిర్ణయం తీసుకుంది. నెట్ ఫ్లిక్స్, డిస్నీ+ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్ పై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసార భారతి ఆధ్వర్యంలో పని చేసే ఓటీటీ వేదికను తీసుకొస్తుంది. భారతీయ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ యాప్ ఉండనుంది.

అయితే ప్రస్తుతం ఉన్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ వంటి ప్రైవేట్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి వచ్చే పోటీని ఎదుర్కొనేందుకు మొదటి రెండు సంవత్సరాలు ఉచిత సర్వీస్ ప్రొవైడ్ చేయనున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. రెండేళ్లు ప్రజలకు ఉచిత సేవలు అందించిన తర్వాత ధరలు నిర్ణయిస్తామని.. ఈ ఓటీటీలో ప్రసారం చేసే కంటెంట్ కుటుంబం మొత్తం చూసే విధంగా విలువలతో కూడినదిగా ఉంటుందని అన్నారు. వినోదంతో పాటు కరెంట్ అఫైర్స్ ని కూడా ఈ ఓటీటీలో కవర్ చేస్తామని అధికారి తెలిపారు. అంటే కేంద్ర ప్రభుత్వం అందించే ఈ ఓటీటీలో రెండేళ్ల పాటు పేద ప్రజలు ఉచితంగా సినిమాలు చూడవచ్చన్నమాట. అది కూడా ఎలాంటి అశ్లీల కంటెంట్ కి తావివ్వని క్లీన్ కంటెంట్. నిజంగా ఇది మంచి వార్తే. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి