Tirupathi Rao
Central Government Reduce Fuel Cost: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది.
Central Government Reduce Fuel Cost: కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేళ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది.
Tirupathi Rao
దేశవ్యాప్తంగా ప్రతి సామాన్యుడు అడిగేది, డిమాండ్ చేసే విషయాలు కొన్ని ఉంటాయి. వాటిలో కచ్చితంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే డిమాండ్ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ట్యాక్సులు ఇలా కారణం ఏదైనా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం దేశంలో మండిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో ఒకసారి వాటి ధరలను తగ్గిస్తూ ఉన్నా.. అది శాశ్వత ఉపశమనం మాత్రం కాదు. అది కేవలం తాత్కాలికమే అవుతోంది. ఎన్నికల సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త చెప్పింది. అదేంటంటే.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ధరల తగ్గింపు దేశవ్యాప్తంగా ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు శుభవార్త చెప్పింది. పెట్రోల్- డీజిల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఇప్పుడు పెట్రోల్- డీజిల్ పై లీటరుకు 2 రూపాయలు తక్కువ కానుంది. ఈ వార్త విన్న వాహనదారులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు తగ్గినా అత్యధికంగా ధర పైసల్లోనే తగ్గుతూ ఉంటుంది. కానీ, ఈసారి ఒకేసారి 2 రూపాయలు తగ్గడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల తగ్గింపు విషయాన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. మరోవైపు దీనికి అదనంగా రాజస్థాన్ ప్రభుత్వం వారి రాష్ట్రంలో 2 వ్యాట్ ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ తగ్గించిన ధరలు రేపు(శుక్రవారం) ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ఇలా ధరలు తగ్గింపుతో ప్రజలకు శుభవార్త చెప్పింది.
Petrol and Diesel prices reduced by Rs 2 per litre pic.twitter.com/r3ObRkKyBX
— ANI (@ANI) March 14, 2024