మోడీ సర్కార్ దసరా కానుక.. ఇకపై వారందరికీ కనీస వేతనం రూ.27 వేలు

Central government : కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ కొత్త కొత్త పథకాలతో ప్రజలకు ఊరట కలిగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం కార్మికులకు ఇచ్చే వేతనాలను సవరించింది. దానికి సంబంధిచిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Central government : కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ కొత్త కొత్త పథకాలతో ప్రజలకు ఊరట కలిగిస్తుంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం కార్మికులకు ఇచ్చే వేతనాలను సవరించింది. దానికి సంబంధిచిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలకు ఊరట కలిగిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త పథకాలను అమలులోకి తీసుకుని వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ప్రజలకు దసరా కానుకను అందచేస్తుంది మోడీ సర్కార్. అదేంటంటే అసంఘటిత రంగంలో పని చేసే కార్మికుల వేతనాలను సవరించింది. వారి కనీస వేతనాల పెంపుపై తాజాగా ఓ ప్రకటన చేసింది. ఏ గ్రేడ్ ప్రాంతాల్లో .. నిర్మాణం , స్వీపింగ్, లోడింగ్ , అన్ లోడింగ్ విభాగాలలో పని చేసే పూర్తి నైపుణ్యం గల కార్మికులకు ఇకపై రోజుకు రూ.1,035 అంటే నెలకు రూ.26,910 వేతనం అందచేయబడుతుంది. అలాగే పాక్షిక నైపుణ్యం గల కార్మికులకు రోజుకు రూ.868 అంటే నెలకు రూ.22,568.. ఇక నైపుణ్యం లేని కార్మికులకు రోజుకు రూ.783 అంటే నెలకు రూ.20,358 అందజేయనున్నట్లుగా.. తెలియజేశారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు అధికారులు. వీరికి మాత్రమే కాకుండా ఇంకా ఏ ఏ రంగాలలో వారికి ఎంత వేతనం అందజేయబడుతుంది. ఎప్పటినుంచి ఇది అమలులోకి వస్తుంది.. అనే విషయం కూడా తెలియజేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వేరియబుల్ డియర్నెస్ ఎలవెన్స్ లను సవరించడం ద్వారా.. ఈ వేతనాలను పెంచినట్లుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. పైన పేర్కొన్న కార్మికులతో పాటు.. క్లరికల్, వాచ్‌మెన్లు, సాయుధ గస్తీ కాసేవారికి రోజుకు రూ.954 అంటే నెలకు రూ.24,804 అందజేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ కొత్త వేతనాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేశారు. స్కిల్డ్ , సెమి స్కిల్డ్ , అన్-స్కిల్డ్ ఆధారంగా ప్రాంతాలను బట్టి.. ఏ, బీ, సి ఇలా మూడు కేటగిరీలుగా విభజించారు. దీనితో కార్మికులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా భవన నిర్మాణం, లోడింగ్, అన్-లోడింగ్, వాచ్, వార్డు, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్‌కీపింగ్, మైనింగ్, వ్యవసాయ రంగాల్లో పని చేసే వారికి.. దీని వలన మరింత మేలు జరుగుతుందని చెప్పి తీరాలి. కేంద్ర ప్రభుత్వం వేరియబుల్ డియర్నెస్ ఎలవెన్స్ లను ఏడాదికి రెండు సార్లు అంటే ఏప్రిల్ 1 , అక్టోబర్ 1న ఇలా ప్రతి ఆరు నెలలకు సవరిస్తుంది.

ఇక ఇదిలా ఉంటె.. రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై నెలలో 2.15 శాతానికి తగ్గింది. గత ఏడాది ఇదే నెలలో 7.54 శాతం ఉంది. అలాగే ఈ ఏడాది జూన్ లో 3.67 శాతం ఉండగా గత ఏడాది.. ఇదే సమయానికి 5.57 శాతం ఉంది. ఇలా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇక ఢిల్లీ ప్రభుత్వం ఇలా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలను.. పెంచిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం నుంచి ఉత్తర్వులు జారీ అవ్వడం గమనార్హం. ఇటీవల ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అతిశీ సింగ్.. తాజాగా కార్మిక వేతనాలపై ఉత్తర్వులు జారీ చేశారు . మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments