iDreamPost
android-app
ios-app

ఉచిత గ్యాస్ సిలిండర్ పై కేంద్రం గుడ్ న్యూస్! వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు కేంద్రం.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తున్నాయి.

ఎన్నికలు సమీపిస్తున్నాయి. అటు కేంద్రం.. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ప్రభుత్వాలు వరాల జల్లు కురిపిస్తున్నాయి.

ఉచిత గ్యాస్ సిలిండర్ పై కేంద్రం గుడ్ న్యూస్! వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారి కోసం వివిధ రకాల పథకాలను తీసుకొచ్చారు. ముఖ్యంగా మహిళల కోసం వివిధ రకాల స్కీమ్స్ ను ప్రవేశ పెట్టారు. మహిళల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది. అలానే కేంద్ర ప్రభుత్వం తరచూ ప్రజలకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంటుంది. అలానే తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ విషయంలో కేంద్రం కీలక విషయాలను వెల్లడించింది.. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం కాలంలో గ్యాస్ సిలిండర్లు సామాన్యుడిక గుదిబండలుగా మారాయి. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరకు సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన పథకం ద్వారా సామాన్యులకు ఉచిత LPG సిలిండర్లను అందిస్తుంది. బీజేపీ హయాంలో 2016 లోనే ఉజ్వల యోజన పథకానికి  ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయడం లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి నేటివరకు చాలామంది ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందారు. ఇప్పటికీ ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం  ఈస్కీమ్ కింద చాలామంది అప్లై చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పథకం ద్వారా సహాయం కోరుతున్న వారికి ఒక అవకాశం వచ్చింది. ఉచిత గ్యాస్ సిలిండర్  కోసం ప్రభుత్వం తెలిపిన వివరాలతో అప్లయ్ చేసుకోవచ్చు.

ఉచిత సిలిండర్ పొందాలంటే కచ్చితంగా మహిళలు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.అలాగే దారిద్ర రేఖకు దిగువన ఉన్నట్లు బిపిఎల్ ( BPL )కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. అలానే దరఖాస్తు కు అప్లయ్ చేసే మహిళలు భారతీయలని నిరూపిస్తే..ప్రభుత్వ గుర్తింపు పొందిన కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈపథకానికి అప్లయ్ చేసే దరఖాస్తుదారులు ఆధార్ కార్డు తప్పనిసరి ఉండాలి. అలానే వినియోగంలో ఉన్న మొబైల్ నెంబర్, వయస్సు రుజువు ధృవీకరణ పత్రం కలిగి ఉండాలి. ఉజ్వల యోజన సబ్సిడీ కోసం ఆధార్ కార్డు లింకైన బ్యాంకు వివరాలు, పోర్ట్ సైజ్ ఫోటో కాపీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకం కింద దరఖాస్తు  చేయాలనుకునే వారు ముందుగా సంబంధిత అధికారిక వెబ్ సైట్ https://www.pmuy.gov.in. సందర్శించాలి.