iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 4,660 Jobs అంటూ ప్రకటన.. ఫేక్ అని తేల్చేసిన కేంద్రం

భారతీయ రైల్వేలో 4,660 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకు. దీనిపై కేంద్రం స్పందించింది. ఆ నోటిఫికేషన్ ఫేక్ అని తేల్చి చెప్పింది.

భారతీయ రైల్వేలో 4,660 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకు. దీనిపై కేంద్రం స్పందించింది. ఆ నోటిఫికేషన్ ఫేక్ అని తేల్చి చెప్పింది.

నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 4,660 Jobs అంటూ ప్రకటన.. ఫేక్ అని తేల్చేసిన కేంద్రం

నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇటీవలికాలంలో ఉద్యోగాల పేరిట కొందరు కేటుగాళ్లు మోసాలకు తెరలేపుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాలంటూ ఆశావాహులకు ఎరవేసి లక్షల్లో గుంజుతున్నారు. ఇప్పుడు ఏకంగా భారతీయ రైల్వేలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసేందుకు ప్లాన్ వేశారు. గత కొన్ని రోజులుగా భారతీయ రైల్వే పలు విభాగాల్లోని 4,660 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ జాబ్స్ కు అప్లై చేసుకుందామని ఉద్యోగార్థులు ఇండియన్ రైల్వే వెబ్ సైట్ ను ఓపెన్ చేస్తే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కనిపించడం లేదు. ఈ వ్యవహారం కేంద్రం దృష్టికి చేరడంతో ఈ నోటిఫికేషన్ పై స్పష్టత ఇచ్చింది. అలాంటి నోటిఫికేషన్ ఏదీ విడుదల చేయలేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో-పీఐబీ క్లారిటీ ఇచ్చింది.

రైల్వే శాఖలోని ఉద్యోగాలకు ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది. రైల్వే ఉద్యోగాలను దక్కించుకునేందుకు లక్షల్లో పోటీపడుతుంటారు నిరుద్యోగులు. దీన్నే అదునుగా భావించిన కేటుగాళ్లు భారతీయ రైల్వే పేరిట నకిలీ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ప్రచారం చేస్తున్నారు. 452 రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌, రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్లు, 4208 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి రైల్వే శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆ ఫేక్ ప్రకటనలో ఉంది. ఏప్రిల్‌ 15 వ తేదీ నుంచి మే 14 వ తేదీ వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఫేక్ నోటిఫికేషన్ హల్ చల్ చేస్తోంది.

దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆ ఉద్యోగ ప్రకటన ఫేక్ అని స్పష్టం చేసింది. 4,660 ఉద్యోగాలకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. ఫేక్ లింక్స్ జోలికి వెళ్లకూడదని తెలిపింది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించింది. నోటిఫికేషన్ నిర్ధారణ కోసం భారతీయ రైల్వే అధికారిక వెబ్ సైట్ ను పరిశీలించాలని కోరింది. ఫేక్ నోటిఫికేషన్ల పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని మోసగాళ్ల వలలో చిక్కి నష్టపోకూడదని వెల్లడించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి