P Venkatesh
విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాదికి సంబంధించి 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు సీబీఎస్ఈ సన్నద్ధమవుతోంది. తాజాగా రిజల్స్ట్ తేదీని ప్రకటించారు అధికారులు.
విద్యార్థులకు శుభవార్త. ఈ ఏడాదికి సంబంధించి 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు సీబీఎస్ఈ సన్నద్ధమవుతోంది. తాజాగా రిజల్స్ట్ తేదీని ప్రకటించారు అధికారులు.
P Venkatesh
దేశ వ్యాప్తంగా టెన్త్, ఇంటర్ ఫలితాల సందడి నెలకొంది. పలువురు విద్యార్థులు ఆల్ టైమ్ రికార్డ్ మార్కులతో సత్తాచాటారు. రిజల్ట్స్ వచ్చిన అనంతరం లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఏ కోర్సుల్లో చేరాలి. ఏ కోర్సులు చేస్తే ఫ్యూచర్ కు తిరుగుండదని ఆరా తీస్తున్నారు. టెన్త్ తర్వాత కొందరు కొందరు ఇంటర్ లో చేరాలని చూస్తుంటే మరికొందరు ఒకేషన్ కోర్సులు, ఐటీఐలు వంటి వాటిల్లో చేరేందుకు ఇంట్రస్టు చూపిస్తున్నారు. ఇక ఇంటర్ విద్యార్థులు టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు కొందరు, డిగ్రీలు చదివేందుకు కొందరు మొగ్గుచూపుతున్నారు. కాగా దేశంలో మరోసారి ఫలితాల సందడి నెలకొనబోతోంది. సీబీఎస్ఈ ఫలితాల విడుదల చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాదికి సంబంధించి 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు సీబీఎస్ఈ సన్నద్ధమవుతోంది. ఈ ఏడాది దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు సీబీఎస్‌ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఏడాది సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు.. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నిర్వహించారు.
ఇక విద్యార్థులంతా ఫలితాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల ఫలితాలు మే 20వ తేదీ తర్వాత వెల్లడికానున్నాయి. దీనికి సంబంధించి సీబీఎస్‌ఈ రిజల్ట్స్ అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ లో మే 20వ తేదీ తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంది. విద్యార్థులు తమ ఫలితాలను results.cbse.nic.in,cbse.gov.in లేదా cbseresults.nic.inలో చెక్ చేసుకోవచ్చు.