iDreamPost
android-app
ios-app

వాహనాలపై క్యాస్ట్, మతం స్టిక్కర్స్ అంటిస్తే జైలుకే!

వాహనాలపై క్యాస్ట్, మతం స్టిక్కర్స్ అంటిస్తే జైలుకే!

వాహనాలు, వాహనదారులకు కొన్ని నియమాలు, నిబంధనలు ఉంటాయి. అందరు వాహనదారులు వాటిని కచ్చితంగా పాటించాల్సిందే. రాష్ట్రాలు మారినప్పుడు కొన్ని కొన్ని నిబంధనలు కూడా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎవరైనా బైకో, కారో కొన్న తర్వాత వాటిపై తమ పేర్లు, పిల్లల పేర్లు స్టిక్కర్స్ వేయించుకుంటారు. ఇంకొంతమంది వారి కులం, మతానికి సంబంధించిన వివరాలు తెలిసేలా స్టిక్కర్స్ వేయిస్తారు. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ, ఇకపై అలాంటి స్టిక్కర్స్ వేస్తే జరిమానా కట్టాల్సింది.

అవునండి బాబు బైక్, కారు ఇలా వాహనాలపై మీరు కుల, మత వివరాలు తెలిసేలా స్టిక్కర్స్ అంటిస్తే జరిమానా విధిస్తారు. అలాగే జైలుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వం కూడా ఈ షరతులను చాలా స్ట్రిక్ గా అమలు చేస్తోంది. ఎవరైనా అలాంటి స్టిక్కర్స్ అంటిస్తే జరిమానా కూడా విధిస్తోంది. కాకపోతే ఇదంతా తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి కాస్త ప్రశాంతంగా ఉండండి. ఇదంతా జరుగుతోంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. సీఎం యోగి ఆధిత్యనాథ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వాహనాలపై క్యాస్ట్- రెలీజియన్ స్టిక్కర్స్ ఉంటే జరిమానా విధిస్తున్నారు. గత పది రోజుల్లో యూపీ పోలీసులు 1,542 చలాన్లు విధించినట్లు చెప్పారు.

ఈ క్యాంపైన్ కొనసాగుతూనే ఉంటుందని.. ఎలాంటి వాహనాలపై కుల, మత ప్రాతిపదికన స్టిక్కర్లు, సందేశాలు ఉంటే తప్పకుండా జరిమానా విధిస్తామన్నారు. ఇలాంటి స్టిక్కర్స్ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. మెసేజెస్, క్యాస్ట్- రెలిజియన్ స్టిక్కర్స్ ఉంటే వెనుక వచ్చే వాహనాలు నడిపే డ్రైవర్ దృష్టిని మళ్లించే అవకాశం ఉందన్నారు. తద్వారా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కారు, బైక్ ఇలాంటి వాహనాలపై స్టిక్కర్ ఉంటే మొదటిసారి రూ.వెయ్యి జరిమానా. నంబరు ప్లేట్ పై స్టిక్కర్ వేస్తే రూ.2 వేలు జరిమానా విధిస్తారు. పదే పదే అలాంటి పొరపాట్లు చేస్తూ దొరికితే రూ.10 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే జైలు శిక్ష కూడా పడుతుంది.