నేపాల్‌: నదిలో పడిన బస్సు.. అందులో 40 మంది భారతీయులు!

Nepal Bus Accident, Marsyangdi River, Tanahun District: 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. నదిలో పడిపోయిన ఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. అందులో ఉన్నవారంతా భారతీయులే అని ప్రాథమిక సమాచారం.

Nepal Bus Accident, Marsyangdi River, Tanahun District: 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. నదిలో పడిపోయిన ఘటన నేపాల్‌లో చోటు చేసుకుంది. అందులో ఉన్నవారంతా భారతీయులే అని ప్రాథమిక సమాచారం.

ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నేపాల్‌లోని తనహున్ జిల్లాలో గల మర్స్యంగ్డి నదిలో బస్సు పడిపోయింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న భారత్‌కు చెందిన బస్సు శుక్రవారం ప్రమాదవశాత్తు నదిలో పడిపోయింది. అందులో ఉన్నవారంతా భారతీయులే. బస్సు పోఖారా నుంచి ఖాట్మండుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో నేపాల్ ఆర్మీ సహాయక చర్యలు చేపట్టింది. బస్సు ఉత్తర ప్రదేశ్‌కు చెందిందిగా సమాచారం. బస్సు నంబర్‌.. ‘UP FT 7623’గా పోలీసులు గుర్తించారు. నదిలో పడిన బస్సు పై టాప్‌ అంతా ఊడిపోయింది. సీట్లు కనిపిస్తున్న బస్సు.. నది ఒడ్డకు కొట్టుకు వచ్చినట్లు తనహున్ పోలీస్‌ అధికారి దీప్‌కుమార్ రాయ తెలిపారు. నదిలో గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు.

సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మాధవ్‌ పౌదెల్‌ ఘటనాస్థలికి చేరుకుని.. 45 మంది పోలీసులతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఘటనలో 14 మంది వరకు మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే మరికొంత మంది గాయపడ్డారు. సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ మాధవ్‌ పౌదెల్‌ ఘటనాస్థలికి చేరుకుని.. 45 మంది పోలీసులతో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే.. ఇప్పటి వరకు 14 మంది మరణించినట్లు, మృతదేహాలను నది నుంచి బయటికి తీసినట్లు అధికారులు తెలిపారు. మరో 16 మంది తీవ్రం గాయపడ్డారని, వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సుమారు మరో 11 మంది ఆచూకీ కోసం వెతుకుతున్నామని కూడా తెలిపారు.

Show comments