iDreamPost
android-app
ios-app

నేపాల్‌ బౌలర్లకు మొహమ్మద్‌ షమీ కోచింగ్‌! ఎక్కడా? ఎప్పుడంటే?

  • Published Aug 19, 2024 | 1:00 PM Updated Updated Aug 19, 2024 | 1:00 PM

Mohammed Shami, Nepal, NCA: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. తాజాగా నేపాల్‌ క్రికెటర్లకు కోచింగ్‌ ఇస్తూ కనిపించాడు. మరి ఆ క్రికెటర్ ఎవరు? నేపాల్‌ క్రికెటర్లకు ఎందుకు కోచింగ్‌ ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

Mohammed Shami, Nepal, NCA: టీమిండియా స్టార్‌ క్రికెటర్‌.. తాజాగా నేపాల్‌ క్రికెటర్లకు కోచింగ్‌ ఇస్తూ కనిపించాడు. మరి ఆ క్రికెటర్ ఎవరు? నేపాల్‌ క్రికెటర్లకు ఎందుకు కోచింగ్‌ ఇస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 19, 2024 | 1:00 PMUpdated Aug 19, 2024 | 1:00 PM
నేపాల్‌ బౌలర్లకు మొహమ్మద్‌ షమీ కోచింగ్‌! ఎక్కడా? ఎప్పుడంటే?

అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్న నేపాల్‌ జట్టు.. ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలనికే మంచి మంచి ప్రదర్శనలతో అందర్ని ఆకట్టుకుంది. సరైన ట్రైనింగ్‌ ఇవ్వాలే కానీ, అతి తక్కువ కాలంలోనే ఒక బలమైన టీమ్‌లో మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా ఇంటర్నేషనల్‌లోకి వచ్చి.. సరైన సౌకర్యాలు లేని జట్లకు బీసీసీఐ సాయం చేస్తుందనే విషయం తెలిసిండే. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌కు కూడా బీసీసీఐ చాలా సాయం చేసింది. ఇప్పుడు నేపాల్‌ జట్టుకు కూడా అలాంటి సహకారమే అందిస్తోంది.

బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో నేపాల్‌ జట్టుకు ట్రైనింగ్‌ సెషన్‌ను నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే ఎన్‌సీఏలో రిహ్యాబ్‌ అవుతున్న భారత స్టార్‌ క్రికెటర్లు కూడా నేపాల్‌ ఆటగాళ్లకు ఎంతో విలువైన సలహాలు సూచనలు అందిస్తున్నారు. గాయం నుంచి టీమిండియాకు దూరమై.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ సాధించే పనిలో ఉన్న భారత స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో రిహ్యాబ్‌ అవుతున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న నేపాల్‌ బౌలర్లకు బౌలింగ్‌ టిప్స్‌ చెబుతూ కనిపించాడు షమీ.

అంతర్జాతీయ క్రికెట్‌లో స్టార్‌ బౌలర్‌గా ఇప్పటికే ఎన్నో ఘనతలు సాధించిన షమీ లాంటి ఆటగాడి నుంచి బౌలింగ్‌ మెళకువలు చేర్చుకోవడం నేపాల్‌ యువ బౌలర్లకు ఎంతో ఉపయోగపడుతుందని క్రికెట్‌ నిపుణులు అంటున్నారు. అయితే కొంతమంది పాకిస్థాన్‌ క్రికెట్‌ అభిమానులు నేపాల్‌ భవిష్యత్తును షమీ నాశనం చేస్తున్నాడంటూ అర్థంలేని కామెంట్లు చేస్తున్నారు. వీటికి భారత క్రికెట్‌ అభిమానులు కూడా సరైన విధంగా కౌంటర్‌ ఇస్తున్నారు. ఆ విషయం పక్కనపెడితే.. నేపాల్‌ బౌలర్లకు షమీ కోచింగ్‌ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet giriş