iDreamPost
android-app
ios-app

బస్సుపై కాల్పులు.. ప్రాణం పోతున్నా 35 మందిని కాపాడిన డ్రైవర్!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దూరం కాల్పులకు తెగబడిన ఘటనలకు సంబంధించిన వార్తలు మనం చూస్తుంటాము. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైనా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ డ్రైవర్ మాత్రం తన ప్రాణం పోతున్నా 35 మంది ప్రాణాలు కాపాడాడు.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దూరం కాల్పులకు తెగబడిన ఘటనలకు సంబంధించిన వార్తలు మనం చూస్తుంటాము. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైనా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఓ డ్రైవర్ మాత్రం తన ప్రాణం పోతున్నా 35 మంది ప్రాణాలు కాపాడాడు.

బస్సుపై కాల్పులు.. ప్రాణం పోతున్నా 35 మందిని కాపాడిన డ్రైవర్!

ప్రాణాలపై ప్రతి ఒక్కరి తీపి ఉంటుంది. తమకు ఏదైనా హాని జరుగుతుందంటే.. పక్కవారి ప్రాణాల గురించి కూడా పట్టించుకోరు. ఇంకా చెప్పాలంటే.. ఏదైనా ప్రమాద జరిగినప్పుడు ఇతరుల ప్రాణాల పోయినా పర్లేదు..తాము బతకాలనే భావనలో చాలా మంది ఉంటారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ ప్రాణాలను అడ్డుపెట్టి.. ఇతరుల ప్రాణాలను కాపాడుతుంటారు. కొన్ని రోజుల క్రితం ఆర్టీసీ డ్రైవర్ తనకు గుండెపోటు వచ్చిన కూడా బస్సులో ఉన్న ప్రయాణికుల గురించే ఆలోచించారు. 20 మంది ప్రాణాలు కాపాడి.. ఆయన ప్రాణాలు కోల్పోయారు. తాజాగా దుండగుల కాల్పులో తనకు బుల్లెట్ గాయమైన కూడా 35 మంది ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన చోటుచేసుకుంది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దుండగులు కాల్పులకు తెగబడిన ఘటనలకు సంబంధించిన వార్తలు మనం చూస్తుంటాము. దొంగతనాలు, పగలు ప్రతీకారాల నేపథ్యంలో ఎక్కువగా కాల్పులు జరుగుతుంటాయి. అలానే ఉగ్రవాదుల నుంచి కూడా ఇలాంటి చర్యలు జరుగుతుంటాయి. అయితే ఇలా ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు ఎవరైనా తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో తమ కుటుంబ సభ్యులు ఉన్నా కూడా తమ ప్రాణాలపైనే ధ్యాస ఉంటుంది. అలాంటితే ఇతరుల ప్రాణాల గురించి అస్సలు ఆలోచించారు. అయితే కొందరు మాత్రం తమ ప్రాణాలు పోతున్నా..తోటి వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తారు.

తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ మినీ బస్సుపై సోమవారం అర్ధరాత్రి దోపిడీ దొంగలు కాల్పులు జరిపారు.  ఈ కాల్పుల్లో బస్సు డ్రైవర్ చేతికి బుల్లెట్ తగిలింది. దీంతో చేతిగాయానికి ఎంతో అల్లాడిపోయిన డ్రైవర్ బస్సులోని ప్రయాణికుల గురించి ఆలోచించాడు. తాను బస్సును ఆపేస్తే అందరి ప్రాణాలు పోతాయని గ్రహించి.. అప్రమత్తమైన డ్రైవరు.. ఓ బుల్లెట్‌ గాయమైనా బస్సును ఆపకుండా పోనిచ్చారు. అలా చేతికి బుల్లెట్ గాయంతోనే బస్సును 30 కి.మీ. నడిపి సురక్షితంగా పోలీస్‌స్టేషను ముందుకు ఆపాడు. ఈ బస్సులో దాదాపు 30 మంది యాత్రికులు అమరావతి నుంచి నాగ్‌పుర్‌కు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఈ ఘటన జరిగింది. అమరావతి ఆలయాన్ని దర్శించుకొని యాత్రికులతో నాగ్‌పుర్‌కు తిరుగుప్రయాణం కాగా, వెనుక బొలెరో కారు వెంబడించింది. ముందుకు వెళతారేమో అని డ్రైవర్ రెండుసార్లు వారికి దారి ఇచ్చి మళ్లీ వెనక్కే వచ్చారు. కాసేపటి తరువాత బస్సు ముందుకువచ్చిన దుండగులు కారులో నుంచే నాపై కాల్పులు జరిపారని బాధితులు తెలిపారు.

ఎంతో ధైర్య సాహం ప్రదర్శించిన ఈ డ్రైవర్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇక కాల్పుల ఘటనపై  డ్రైవర్ ఖోమ్ దేవ్ కావడే తన అనుభావి వివరించారు. దుండగులు జరిపిన కాల్పుల్లో మొదటిసారి తప్పించుకోగలిగానని, రెండోసారి తన చేతిపై కాల్చారని అతడు తెలిపాడు. యాత్రికులను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో నొప్పిని భరిస్తూనే 30 కి.మీ. బస్సు నడిపానని ఖోమ్ దేవ్ వివరించారు. ప్రాణాలకు తెగించి డ్రైవరు తామను దోపిడీ దొంగలకు కాపాడాడని యాత్రికులు తెలిపారు. మరి.. ఎంతో ధైర్యం ప్రదర్శించి.. 35 మంది ప్రాణాలు కాపాడిన ఈ డ్రైవర్ పై మీ  అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.