గుండెపోటుతో ప్రాణాలు పోతున్నా.. ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్

ఈ మద్య దేశ వ్యాప్తంగా హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది.

ఈ మద్య దేశ వ్యాప్తంగా హఠాత్తుగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది.

ఇటీవల దేశంలో వరుస గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోగా కన్నుమూస్తున్నారు. ఎక్కువగా వ్యామామం, డ్యాన్స్ చేయడం, అనారోగ్య కారణాల వల్ల చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్లు గుండెపోటుతో చనిపోతున్నారు. ఓ డ్రైవర్ తనకు గుండెపోటు వచ్చినా.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఒడిశాలో సనా ప్రధాన్ అనే బస్సు డ్రైవర్ భువనేశ్వర్ వెళ్తున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. అప్పటికే బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. తాను చనిపోతున్నా అని భావంచి ఓ గోడకు ఢీ కొట్టి బస్సు ఆపాడు. దీంతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. సనా ప్రధాన్ అనే డ్రైవర్ భువనేశ్వర్ నగరానికి వెళ్తున్న సమయంలో మధ్యలో చాతి నొప్పి రావడంతో స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయాడు. డ్రైవర్ పరిస్థి గమనించిన ప్రయాణికులు భయంతో వణికిపోయారు. కానీ తన ప్రాణాలకు తెగించి గోడకు ఢీకొట్టి బస్సు ఆపి మా ప్రాణాలు కాపాడారు. కంధమాల్ జిల్లాలోని పబురియా గ్రామ సమీపంలో జరిగింది.

ఈ ఘటన గురించి ప్రయాణికుడు మాట్లాడుతూ.. రాత్రి తాము ప్రయాణిస్తున్న బస్సు డ్రైవర్ హఠాత్తుగా గుండెపోటుతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అప్పటికే స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోయాడు.. కానీ తన ప్రాణాలు లెక్కచేయకుండా బస్సును చాలా వరకు కంట్రోల్ చేసి సమీపంలో ఉన్న గోడకు ఢీ కొట్టి బస్సును ఆపాడు. దీంతో అందరం ఊపిరి పీల్చుకున్నాం. వెంటనే డ్రైవర్ ని ఆసుపత్రికి తరలించారు.

ఘటన జరిగిన తర్వాత వెంటనే బస్సు డ్రైవర్ సనా ప్రధాన్ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే డ్రైవర్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన గురించి టికాబలి పోలీస్ స్టేషన్ ఇంచార్జి మాట్లాడుతూ.. లక్ష్మీ ప్రైవెట్ బస్సు కంధమాల్ లోని సారన్ ఘర్ నుంచి జి ఉదయగిరి మీదుగా భువనేశ్వర్ కి ప్రతిరాత్రి తిరుగుతుంది ని ఎస్ ఐ తెలిపారు. డ్రైవర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ ఐ తెలిపారు.

Show comments