iDreamPost
android-app
ios-app

హృదయాన్ని కదిలించే దృశ్యం.. బతుకు దెరువు కోసం వెళ్లి.. చివరకు బతుకు బండి మీదనే..

Odisha: ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం బయలు దేరి ప్రాణాలు కోల్పోయాడు. బతుకు బండిని లాగించిన బండిమీదనే తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తుంది. అసలు ఏం జరిగిందంటే?

Odisha: ఓ వ్యక్తి బతుకు దెరువు కోసం బయలు దేరి ప్రాణాలు కోల్పోయాడు. బతుకు బండిని లాగించిన బండిమీదనే తుది శ్వాస విడిచాడు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలిచి వేస్తుంది. అసలు ఏం జరిగిందంటే?

హృదయాన్ని కదిలించే దృశ్యం.. బతుకు దెరువు కోసం వెళ్లి.. చివరకు బతుకు బండి మీదనే..

మానవ జీవితం సుఖ దుఃఖాల మయం. జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతికేందుకు నిత్యం పోరాటం చేయాల్సిందే. అలుపన్నదే లేకుండా కష్టపడాల్సిందే. జీవించడానికి ఏదో ఒక పని చేయాల్సిందే. కాయా కష్టం చేసి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ క్రమంలో ఎంత కష్టమైనా భరించాలి. నేటి రోజుల్లో కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. ఓ వైపు పెరుగుతున్న నిత్యావసర ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ధరలు ఆకాశాన్నంటుతుండడంతో మూడు పూటలు తినలేని పరిస్థితులు తలెత్తుతున్నాయి. చాలీ చాలనీ జీతాలతో సంసార సాగరాన్ని ఈదుతూ వస్తున్నారు. ఏ ఉద్యోగం లేని వారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.

పూట గడవక, పిల్లలను చదివించుకోలేక పుట్టెడు దుఃఖంలో మునిగిపోతున్నారు. అయినా సరే అధైర్య పడకుండా కష్టాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. ఇదే రీతిలో ఓ వ్యక్తి తినుబండారాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. టీవీఎస్ బండి మీద వీది వీది తిరుగుతూ తినుబండారాలను విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా కష్టపడి బ్రతికే అతనిపై కాలం కన్నెర్ర చేసింది. విధి ఆడిన వింతనాటకంలో ఆయన ఓడిపోయాడు. ఓ రోజు బతుకు దెరువు కోసం టీవీఎస్ బండిపై బయలు దేరిన అతను చివరకు ఆ బతుకు బండిమీదనే ప్రాణాలు వదిలాడు. హృదయాన్ని కదిలించే ఈ దృశ్యం ప్రతి ఒక్కరికి కన్నీళ్లను తెప్పిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.

ఈ ఘటన ఒడిషాలో చోటుచేసుకుంది. అసలు ఆ వ్యక్తికి ఏమైంది? ఎలా చనిపోయాడు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఒడిషాలో 40 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి టీవీఎస్ బండికి తినుబండారాలు కట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముతుంటాడు. దానిపై వచ్చే ఆదాయంతో భార్యా బిడ్డలను పోషించుకుంటున్నాడు. రోజు మాదిరిగానే ఆ రోజు కూడా తినుబండారాలు అమ్మడానికి బయలుదేరాడు. కాసేపు వీదుల్లో తిరిగాడు. ఆ తర్వాత అతడు బండిమీద నిద్ర పోతున్నట్లు కనిపించాడు. ఆ దారిలో వచ్చిపోయే వారు అతన్ని చూస్తూ వెళ్తున్నారు. అయితే ఆ వ్యక్తిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

సదరు వ్యక్తి దగ్గరకు వచ్చిన కొందరు అతన్ని పిలిచిచినా.. కదిలించి చూసినా ఉలుకూ పలుకూ లేదు. అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. హుటా హుటినా ఆసుపత్రికి తరలించగా.. వాహనంపై కూర్చొని ఉండగానే గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బతుకు బండిని లాగించిన ఆ బండిమీదనే గుండెపోటుతో మరణించడంతో ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ప్రాణం నీటి మీద బుడగలాంటిదని ఎప్పుడు చిట్లి పోతుందో ఊహించలేమని కామెంట్ చేస్తున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరని మరికొందరు స్పందిస్తున్నారు. మరి బతుకుదెరువు కోసం వెళ్లి బతుకు బండి మీదనే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.