Maharashtra: ఘోర విషాదం: భారీ వానలకు కుప్పకూలిన మూడంతస్తుల భవనం!

ఘోర విషాదం: భారీ వానలకు కుప్పకూలిన మూడంతస్తుల భవనం!

Maharashtra: గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. అలానే దేశంలో పలు ప్రాంతాల్లో కూడా వానాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలి విషాదం చోటుచేసుకుంది.

Maharashtra: గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వానలు కురుస్తున్నాయి. అలానే దేశంలో పలు ప్రాంతాల్లో కూడా వానాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రాంతంలో మూడంతస్తుల భవనం కుప్పకూలి విషాదం చోటుచేసుకుంది.

ఇటీవల కొన్ని రోజుల నుంచి వానాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా నైరుతి రుతపవనాలు, బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా దేశ వ్యాప్తంగా వానలు విజృంభిస్తోన్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ ప్రాంతాలు జలమయం అయ్యాయి. అంతేకాక పలు ప్రాంతాల్లో రాకపోకలు బంద్ అయ్యాయి. ఇది ఇలా ఉంటే.. భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే  ఎంతో మంది అమాయలుకు ఈ విపత్తుకు విలవిల్లాడిపోతున్నారు. తాజాగా భారీ వర్షాలకు ఓ విషాదం చోటుచేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటన ముంబై నగరంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

మహారాష్ట్రలోని నవీ ముంబైలో  శుక్రవారం రాత్రి భారీ వానలు కురిశాయి. అంతేకాక గత కొన్ని రోజుల నుంచి ముంబై నగరంలో వానలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ముంబై నగరంలోని షాబాజ్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ భవనంలో 24 కుటుంబాలు నివాసం ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానికులు  అందించిన సమాచారంతో పోలీసులు, రెస్క్యూ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన భవనం కూలిన ప్రాంతానికి చేరుకున్నారు. భవనంమ శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ ఎఫ్ కూడా ఈ సహాయక చర్యలు పాల్గొన్నారు. శనివారం ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు నగర మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తెలిపారు.

ఇప్పటి వరకు ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను సురక్షితంగా బయటికి తీసినట్లు తెలుస్తోంది. అలానే ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలిపోయిన భవనం జీప్లస్3 గా ఉందని, అలానే ఇందులో మొత్తం 13ప్లాట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వారి ప్రాణాలకు ప్రమాదం లేనట్లు డాక్టర్లు పేర్కొన్నారు. అయితే, కూలిపోయిన భవనం పదేళ్లనాటిదని, ఈ సంఘటనపై పూర్తి విచారణ చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఆ బిల్డింగ్ యాజమానిపై చర్యలు కూడా తీసుకుంటామని ఆయన అన్నారు.

గత వారం రోజుల నుంచి ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే విధంగా రాయగడ, రత్నగిరి, సింధుదుర్గ్, పూణే, సతారా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇటీవలే ఓ ప్రాంతంలో కొండ చరియలు విరిగి పడి 299 మంది మరణించారు. ఇలా భారీ వర్షాలకు పలు ప్రాంతాలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Show comments