కొడుకు కోసం నాలుగు రోజులుగా డ్రైనేజీలోనే తండ్రి!

తల్లిదండ్రులు.. పిల్లలనే తమ ఆస్తిగా భావించి జీవితాన్నిసాగిస్తుంటారు. అలాంటి తమ బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చిన వారు అల్లాడిపోతారు. తాజాగా ఓ తండ్రి..తన బిడ్డ కోసం నాలుగు రోజుల పాటు డ్రైనేజీలోనే ఉన్నాడు.

తల్లిదండ్రులు.. పిల్లలనే తమ ఆస్తిగా భావించి జీవితాన్నిసాగిస్తుంటారు. అలాంటి తమ బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చిన వారు అల్లాడిపోతారు. తాజాగా ఓ తండ్రి..తన బిడ్డ కోసం నాలుగు రోజుల పాటు డ్రైనేజీలోనే ఉన్నాడు.

ప్రతి ఒక్క తల్లిదండ్రులకు తమ బిడ్డలపై ఎన్నలేని ప్రేమ ఉంటుంది. అందుకే పెద్దలు అంటారు. ఆకాశాన్ని అమ్మానాన్నల ప్రేమలను ఎప్పటికి, దేనితోనూ  కొలవలేమని. తమ బిడ్డల భవిష్యత్ కోసం ఎంతో కృషి చేస్తుంటారు. పిల్లలనే తమ ఆస్తిగా భావించి జీవితాన్నిసాగిస్తుంటారు. అలాంటి తమ బిడ్డలకు ఏ చిన్న కష్టం వచ్చిన ఆ తల్లిదండ్రులు అల్లాడిపోతారు. అలాంటిది బిడ్డా ప్రాణాలతో లేకుంటే.. ఇక ఆ అమ్మానాన్నల పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే పొరపాటును డ్రైనేజిలో పడిపోయిన కొడుకు కోసం ఓ తండ్రి నాలుగు రోజులుగా అందులోనే ఉన్నాడు. ఈ హృదయవిదారక ఘటన అందరిని కన్నీరు పెట్టిస్తుంది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

జోరునా కురుస్తోన్న వర్షంలో కొడుకును తీసుకుని ఓ తండ్రి ఇంటికి బయలుదేరాడు. వెనక కూర్చున్న 8 ఏళ్ల బాలుడు.. అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీలో  పడిపోయాడు. దీంతో ఆ కాలువలో వరద నీరు ఉద్దృతంగా ప్రవహిస్తుంటంతో  అందులో కొట్టుకోపోయాడు. అదే సమయంలో వెంటనే తెరుకున్న ఆ బాలుడి తండ్రి తన బిడ్డను కాపాడుకునేందుకు ఎంతగానే ప్రయత్నించాడు. అయినా ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక కనీసం తన కొడుకు శరీరాన్ని అయినా ఇంటికి తీసుకెళ్లాలని భావించాడు. అందుకే కొడుకు కోసం నాలుగు రోజుల నుంచి డ్రైనేజీలో వెతుకుతూనే ఉన్నాడు. ఈ ఘటన అస్సాంలోని గౌహతీ నగరంలో చోటుచేసుకుంది.

అస్సాం రాష్ట్రంలో గుహాటి నగరంలో హిరాలాల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఆయనకు అవినాష్ అనే 8 కుమారుడు ఉన్నాడు. స్థానికంగా పని చేసుకుంటూ తన కుటుంబంతో పాటు ఆయన నివాసం ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం అంటే.. శనివారం సాయంత్రం తన కుమారుడితో కలిసి బయటకు వెళ్లాడు హిరాలాల్. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో జోరున వాన కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయ్యంగా మారాయి. ఇదే సమయంలో జోరుగా కురుస్తున్న వానలో బయటకు వెళ్లిన హిరాలాల్ అతని కుమారుడు తిరిగి ఇంటిక బయలు దేరారు. మార్గం మధ్యలో అదుపుతప్పి ఆ బాలుడు డ్రైనేజీలో పడిపోయాడు. ఇక వెంటనే కాల్వలో పడిపోయిన తన బిడ్డను కాపాడేందుకు హిరాలాల్ ఎంతో ప్రయత్నం చేశాడు. అయితే నీరు ఉద్దృతంగా ప్రహిస్తుండటంతో బాలుడు కనిపించలేదు.

ఇక తన బిడ్డ చనిపోయాడని భావించి.. ఎలాగైన తన బిడ్డ డెడ్ బాడీనైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో అక్కడే ఉన్న అన్ని డ్రైనేజీల్లో వెతకడం ప్రారంభించాడు. నాలుగు రోజుల పాటు వెతకగా  చివరకు ఆ బాలుడి చెప్పులను హిరాలాల్ కనిపెట్టాడు. వాటి ఆధారంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఆ బాలుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తన కుమారుడు దొరికే వరకు అక్కడి నుంచి వెళ్లనని భీష్మించుకుని కూర్చున్నాడు. అస్సాం ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనపై స్పందించి.. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తంగా తన కొడుకు కోసం ఆ తండ్రి నాలుగు రోజుల పాటు డ్రైనేజీలో ఉండటం అందరిని కలచి వేసింది. మరి.. ఈ హృదయ విదారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments