Arjun Suravaram
Bombay High Court: ప్రస్తుతం చాలామంది ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. అయితే కొందరు భార్యలు లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలాంటి కేసులపై ఓ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Bombay High Court: ప్రస్తుతం చాలామంది ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. అయితే కొందరు భార్యలు లేనిపోని ఆరోపణలతో భర్త, అతని బంధువులపై కేసులు నమోదు చేస్తుంటారు. ఇలాంటి కేసులపై ఓ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Arjun Suravaram
భార్యాభర్తల మధ్య గొడవ అనేవి సర్వసాధారణం. ఇక ఇటీవల దంపతులు.. తమ మధ్య జరిగే గొడవలతో పోలీస్ స్టేషన్, కోర్టుల మెట్లు ఎక్కుతున్నారు. ఇది ఇలా ఉంటే కొందరు మహిళలు..తమ భర్తపై, అత్తింటివారిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఇలాంటి కేసులతో సదరు భర్త తీవ్ర వేదనకు గురవుతుంటారు. ఇంకా చెప్పాలంటే.. తప్పుడు కేసులు పెట్టి..కొందరు మహిళలు..తమ భర్తలను హింసింస్తుంటారు. ఈ విషయంపైనే తాజాగా ఓ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మహిళల రక్షణ కోసం ఉన్న సెక్షన్ 498 గురించి అందరికి తెలిసిందే. దీని ద్వారా స్త్రీలు తమ అత్తింటిల్లో ఎదుర్కొనే వేధింపుల గురించి ఫైట్ చేయవచ్చు. ఈ సెక్షన్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. ఈ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదైతే.. బెయిల్ కూడా రాద్దు. ఇలా తమ రక్షణ కోసం ఉన్న 498ఏ, బి సెక్షన్లను కొందరు మహిళలు తప్పుగా వినియోగిస్తున్నారు. ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న గొడవకు భర్తపై, అత్తింటివారిపై 498 సెక్షన్ కింద ఫిర్యాదు చేస్తున్నారు. ఏ తప్పు చేయకున్న ఈ సెక్షన్ల కింద ఇరుక్కున్న వారు..నరకం అనుభవిస్తున్నారని పలువురు అభిప్రాయా పడుతున్నారు. అలానే తప్పుడు కేసులు పెట్టి భర్తలను హింసిస్తున్నారనే వాదనలు వినిపించాయి. తాజాగా ఇదే అంశంపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది
భర్తను, అతని బంధువులను అసత్యపు ఆరోపణలతో కేసులు నమోదు చేసి..వేధించడంపై ఔరంగాబాద్ లోని హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. భర్తను భార్య తప్పుడు కేసులతో వేధించడం క్రూరత్వ చర్యగానే పరిగణించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఫ్యామిలీ కోర్టు జారీ చేసిన విడాకులను రద్దు చేసి, దాంపత్య హక్కులను పునరుద్ధరించాలన్న ఓ మహిళ బాంబే హైకోర్టులో పిటిషన్ వేసింది. సదరు మహిళ వేసిన పిటిషన్ ను తోసిపుచ్చుతూ హైకోర్డు న్యాయమూర్తి జస్టిస్ వై.జి.ఖబ్రగడే పై విధంగా తీర్పు ఇచ్చారు. ఇక అసలు కథ ఏమిటంటే.. ముంబైలో నివాసం ఉండే ఓ జంటకు 2004లో వివాహమై.. 2012 వరకు కలిసి ఉండి ఆ తర్వాత విడిపోయారు.
అనంతరం ఆ మహిళ తన పుట్టింటికి వెళ్లింది . అనంతరం తనను వేధిస్తున్నారంటూ భర్త, అతని తండ్రి, సోదరుడిపై సదరు మహిళ కేసు పెట్టింది. అయితే, కోర్టు మాత్రం వారిని నిర్దోషులుగా ప్రకటించాయి. తప్పుడు కేసులు పెట్టి తనను మానసిక వేధించిన భార్య నుంచి విడాకులు కావాలంటూ భర్త ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. ఈక్రమంలో 2023లో ఆ జంటకు విడాకులు మంజూరయ్యాయి. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మాజీ భార్య హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది.