P Krishna
Bombay High Court Judgment: సాధారణంగా భార్యాభర్తలు ఏ కారణం చేతనైనా విడిపోతే భర్త.. భార్యకు మెయింటెనెన్స్ కోసం కొంత భరణం చెల్లించాల్సి ఉంటుంది.
Bombay High Court Judgment: సాధారణంగా భార్యాభర్తలు ఏ కారణం చేతనైనా విడిపోతే భర్త.. భార్యకు మెయింటెనెన్స్ కోసం కొంత భరణం చెల్లించాల్సి ఉంటుంది.
P Krishna
భారత దేశంలో వివాహబంధానికి ఎంతో విలువనిస్తారు. వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను పెద్దలు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు. కానీ, ప్రస్తుత సమాజంలో పెళ్లైన కొంత కాలానికే భార్యాభర్తల చిన్న చిన్న విభేదాలు రావడం.. అవి గొడవలు, కొట్లాటలకు దారి తీయడం జరుగుతుంది. దీంతో దంపతులకు ఇరు కుటుంబాలు సర్ధి చెప్పే ప్రయత్నాలు చేసినప్పటికీ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. సాధారణంగా విడాకులు తర్వాత భార్యలకు భర్తలు తమ స్థాయికి తగ్గట్లు భరణం చెల్లించడం చూస్తూనే ఉన్నాం. కానీ మొదటిసారిగా భరణం విషయంలో బాంబే హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
విడాకుల తర్వాత భరణం చెల్లించే విషయంలో బాంబే హై కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు విడాకుల తర్వాత భార్యకు భర్త భరణం చెల్లించడం చూశాం. తాజాగా మాజీ భర్తకు నెలవారీ భరణం చెల్లించాలని బాంబే హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితమైన మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ.10 వేలు చెల్లించాలని ఓ మహిళను బాంబే హై కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ షర్మిల దేశ్ ముఖ్ తీర్పు చెబుతూ భారత దేశంలో హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం నిబంధనల్లో భార్యాభర్తల అనుబంధం ఎంతో పవిత్రమైనది. జీవిత భాగస్వామి అన్న పదం భర్తకు, భార్యకు ఇద్దరికీ వర్తిస్తుంది. సంపాదించే మహిళ.. అనారోగ్యం, వైద్య పరమైన ఇబ్బందులతో జీవనోపాధి పొందలేని స్థితిలో ఉన్న మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందే అని జస్టిస్ షర్మిలా దేశ్ ముఖ్ తో కూడిన సింగిల్ బెంచ్ పేర్కొంది.
అసలు విషయానికి వస్తే.. మహరాష్ట్రకు చెందిన ఇద్దరు దంపతులు కొంత కాలం క్రితం విడిపోయారు. ఈ క్రమంలోనే మాజీ భర్త తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని.. వైద్య పరమైన ఖర్చులకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని.. అందువల్ల బ్యాంక్ మేనేజర్ గా ఉద్యోగం చేస్తున్న తన భార్య నుంచి మెయింటెనెన్స్ ఇప్పించాలని వేసిన పిటీషన్ ను బాంబే హై కోర్టు స్వాగతించి విచారణ చేపట్టి ఈ తీర్పు వెలువరించింది. మాజీ భర్తకు నెలవారీ భరణం కింద రూ. 10 వేలు చెల్లించాలని సివిల్ కోర్టు 2020 మార్చిలో ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కారణాలు చూపిస్తూ ఈ తీర్పు సవాలు చేస్తూ సదరు మహిళ వేసిన పిటీషన్ కొట్టివేస్తూ ధర్మాసనం గురువారం ఈ సంచలన తీర్పు వెలువరించింది.