iDreamPost

10 స్కూళ్లల్లో బాంబు పెట్టాం అంటూ ఇమెయిల్ ద్వారా బెదిరింపులు.. ఎక్కడంటే?

Schools Get Bomb Blast Threat: ఇటీవల బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ మధ్య కొంతమంది కేటుగాళ్ళు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్, ఇమెయిల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

Schools Get Bomb Blast Threat: ఇటీవల బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దేశం ఉలిక్కిపడేలా చేసింది. ఈ మధ్య కొంతమంది కేటుగాళ్ళు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపు కాల్స్, ఇమెయిల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.

10 స్కూళ్లల్లో బాంబు పెట్టాం అంటూ ఇమెయిల్ ద్వారా బెదిరింపులు.. ఎక్కడంటే?

ఇటీవల దేశ వ్యాప్తంగా పలు చోట్ల బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, బడా వ్యాపారులతో పాటు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, షాపింగ్ మాల్స్ ఇలా జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలను ఎంచుకొని బాంబు బెదిరింపులకు పాల్పపడున్నారు. ఈ మద్యనే బెంగుళూరులో రామేశ్వరం కేఫ్ లో జరిగిన బాంబ్ బ్లాస్ దేశం అంతా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో 10 మంది వరకు గాయపడ్డారు. ఇటీవల స్కూల్స్ ని టార్గెట్ చేసుకొని బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్న ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అలాంటి ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

దేశంలో పలు రాష్ట్రాల్లో తరుచూ బాంబు బెదిరింపులు వస్తున్నాయి. ముఖ్యంగా స్కూళ్ల, కాలేజీలను టార్గెట్ చేసుకొని కొంతమంది దుండగులు బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. బుధవారం ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఉన్న స్కూళ్లలో బాంబ్ పెట్టినట్లు పోలీసులకు బెదిరింపు ఇమెయిల్స్ రావడం తీవ్ర కలకలం రేపింది. పది స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఆయా విద్యాసంస్థలు వెంటనే స్కూళ్లకు సెలవు ప్రకటించాయి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో భయబ్రాంతులకు గురై వెంటనే స్కూళ్లకు పరుగులు పెట్టారు. తమ పిల్లలను వెంట తీసుకొని ఇంటికి బయలుదేరారు.

బాంబు బెదిరింపులు వచ్చిన స్కూల్స్ కి పోలీసులు, బాంబ్ స్క్వాడ్ బృందాలు బయలుదేరి ముమ్మర తనిఖీలు చేపట్టాయి. రష్యాలోని సర్వర్ ల ద్వారా ఇమెయిల్స్ వచ్చాయని పోలీస్ అధికారి తెలిపారు. ఒకవేళ నిజంగా బాంబ్ ఉందని బెదిరించారా? లేక భయపెట్టేందుకు ఇలా ఎవరైనా ప్రాంక్ చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే.. మంగళవారం బెంగుళూరు లోని 8 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఇమెయిల్స్ వచ్చాయి. ఈ నెల 8 న ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలోని 100 కు పైగా స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిన్స్ వచ్చాయి. నోయిడాలోని రెండు పాఠశాలకు బాంబు బెదిరింలపులు వచ్చాయి. వెంటనే రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ స్కూల్స్ ని క్షణ్ణంగా తనిఖీలు జరిపగా ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో అవి ఫేక్ మెయిల్స్ అని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి