iDreamPost
android-app
ios-app

TCS కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసింది ఎవరో తెలిసి షాక్ తిన్న పోలీసులు!

  • Published Nov 14, 2023 | 7:07 PM Updated Updated Nov 14, 2023 | 7:09 PM

ఇటీవల పలు కంపెనీలకు, సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బాంబ్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

ఇటీవల పలు కంపెనీలకు, సినీ సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బాంబ్ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

TCS కంపెనీకి బాంబ్ బెదిరింపు కాల్.. చేసింది ఎవరో తెలిసి షాక్ తిన్న పోలీసులు!

ఇటీవల సినీమా సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలకు బాంబ్ బెదిరింపు కాల్స్ రావడం సర్వసాధారణం అయ్యింది. బెదిరింపు కాల్స్ రాగానే వెంటనే పోలీసులు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్‌ తో జల్లెడ పడుతున్నారు. కానీ ఎలాంటి బాంబు లభించకపోవడంతో వెనుతిరుగుతున్నారు. బాంబ్ బెదిరింపు కాల్స్ ఫేక్ అని తెలియడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా ప్రముఖ కంపెనీకీ బాంబ్ బెదిరింప్ కాల్ రావడంతో హడలిపోయారు. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు టీసీఎస్ కంపెనీకి బాంబ్ బెదిరింప్ కాల్ వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్‌ తో ఆఫీస్ మొత్తం జల్లెడ పట్టారు. కానీ ఎక్కడ కూడా బాంబు జాడ లభించలేదు. మొత్తానికి అక్కడ ఎలాంటి బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు పోలీసులు.  దీంతో వచ్చింది ఫేక్ కాల్ అని క్లారిటీకి వచ్చారు. బాంబ్ బెదిరింపు కాల్ చేసింది ఎవరు అన్న విషయందానిపై దృష్టి పెట్టారు. అయితే కాల్ చేసింది ఎవరో తెలుసుకొని పోలీసులు షాక్ తిన్నారు.

బాంబ్ బెదిరింపు కాల్ చేసింది హూబ్లీకి చెందిన కంపెనీ మాజీ మహిళా ఉద్యోగిని అని తెలిసింది. ఆమె కోసం పోలీసులు వెతుకుతున్నారు. బెంగుళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ క్యాంపస్ లో ఉద్యోగం నిర్వహించేది. కొన్ని కారణాల వల్ల ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఇది మనసులో పెట్టుకొని ఆ మహిళా ఉద్యోగిని టీసీఎస్ క్యాంపస్ లోని బి బ్లాక్ కి బాంబు బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్ లోని టీసీఎస్ కొండాపూర్ క్యాంపస్ కి ఓ అజ్ఞాత వ్యక్తి బాంబ్ బెదిరింపు కాల్ చేయగా.. అక్కడ పని చేస్తున్న 1500 మంది ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు. మొత్తానికి అది కాస్త ఫేక్ కాల్ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.