iDreamPost

2024 లోక్ సభ ఎన్నికల్లో రికార్డు.. 11.7 లక్షల భారీ మెజార్టీ! ఎక్కడంటే..

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య హోరాహోరి ఉంది. ఇదే సమయంలో ఈ సారి ఎన్నికల్లో ఓ అరుదైన రికార్టు నమోదైంది. తాజాగా లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదైంది.

దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య హోరాహోరి ఉంది. ఇదే సమయంలో ఈ సారి ఎన్నికల్లో ఓ అరుదైన రికార్టు నమోదైంది. తాజాగా లోక్ సభ ఎన్నికల చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదైంది.

2024 లోక్ సభ ఎన్నికల్లో రికార్డు.. 11.7 లక్షల భారీ మెజార్టీ! ఎక్కడంటే..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ల మధ్య హోరాహోరి ఉంది. ఎన్డీయో కూటమి గతం కంటే.. చాలా స్థానాలు కోల్పోయింది. అలానే  కాంగ్రెస్ ఉన్న ఇండియా కూటమి..గతం కంటే మెరుగైన స్థానాల్లో విజయం సాధించింది. ఇంకా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇక 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. అంతేకాక లోక్ సభ మెజార్టీ విషయంలో గత రికార్డు కనుమరుగైంది. తాజాగా ఓ అభ్యర్థి 11.7 లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మరి.. ఆ నేత ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల్ ఓట్ల ప్రక్రియ కొనసాగుతోంది. అబ్ కీ బార్ చార్ సౌ పార్ అనే నినాదంతో ఎన్డీఏ కూటమి ఎన్నికల్లోకి వెళ్లింది. అయితే ఆ నినాదం కలగానే మిగిలిపోయింది. భారతీయ జనత పార్టీకి చెందిన ఎన్డీఏకూటమికి ఇండియా కూటమి గట్టిగా పోటీనిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో రికార్డు మెజార్టీలు సాధిస్తోంది. అంతేకాక గతంలో బీజేపీ భారీ విజయాలు సాధించిన స్థానాల్లోకూడా ఇండియా కూటమి జయకేతనం ఎగరేస్తుంది.

గతంలో కంటే.. ఈ సారి గణనీయంగా స్థానాలను పెంచుకుంది ఇండియా కూటమి. గతంలో మాదిరిగా బీజేపీ సొంతంగా మెజార్టీ స్థానాలు సాధించలేదు. అయితే ఎన్డీయే కూటమి కూడా చాలా నియోజకవర్గాల్లో భారీ మెజార్టీలు సొంతం చేసుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌ లోక్ సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి భారీ మెజార్టీతో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

ఇండోర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శంకర్ లల్వాణీ సరికొత్త రికార్డు సాధించారు. ఆయన11,75,092 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్‌ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి చివరి నిమిషంలో నామినేషన్‌ వెనక్కి తీసుకున్నారు. దీంతో శంకర్ ఈ అరుదైన రికార్టును తన పేరున లిఖించుకున్నారు. అలానే ఈ నియోజకవర్గంలో రెండో స్థానంలో నోటా ఉండటం గమనార్హం. ఇండోర్‌లో నోటాకు 2,18,674 ఓట్లు పడ్డాయి. నోటా చరిత్రలోనే ఒక నియోజకవర్గంలో ఇంత భారీగా ఓట్లు పడటం ఇదే ప్రథమం.

దీంతో అత్యధిక ఓట్ల మెజార్టీతో పాటు నోటాకు కూడా అత్యధిక ఓట్లు పడిన ఒకే ఒక లోక్ సభ స్థానంగా  ఇండోర్ రికార్డుల్లోకి ఎక్కింది. ఇండోర్ నియోజకవర్గంలో మొత్తం 14 మంది పోటీలో నిలవగా.. ఎవరూ శంకర్ లాల్వానీ దరిదాపుల్లో కూడా రాకపోవడం గమనార్హం. ఇ ది ఇలా ఉంటే ఇక్కడ ఇప్పటి లోక్‌ సభ చరిత్రలో ఇప్పటివరకు బీజేపీ నాయకురాలు ప్రీతమ్‌ ముండే పేరిట 6.9 లక్షలు అత్యధిక మెజార్టీ రికార్డు ఉంది. ఆమె రికార్డును శంకర్‌ లల్వానీ దాన్ని అధిగమించారు. మరి.. ఈ అరుదైన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి