P Venkatesh
P Venkatesh
మరికొన్ని నెలల్లో శాసన సభ ఎన్నికలు జరుగనున్న వేళ బీజేపీకి షాక్ తగిలింది. ఏకంగా ఓ జీజేపీ ఎమ్మెల్యే కూతురు తన తండ్రికి టిక్కెట్ ఇవ్వొదంటూ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చింది. ఈ వ్యవహారం బీజేపీ పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. గతంలో ఓ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, తన కూతరుకు మధ్య చోటుచేసుకున్న భూవివాదం కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వయంగా ఎమ్మెల్యే కూతురే మా నాన్నకి టిక్కెట్ ఇవ్వొద్దంటూ నిరసన వ్యక్తం చేయడంతో చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ లో బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అయిన తన తండ్రికి పార్టీ టిక్కెట్ ఇవ్వద్దంటూ ఆయన కుమార్తెనే నిరసన చేపట్టింది. ఒకవేళ టిక్కెట్ ఇస్తే తన తండ్రిపై రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపి, ఇతర టిక్కెట్ ఆశావహులతో కలిసి ఓడిస్తానని హెచ్చరించింది. సొంత కుటుంబసభ్యుల నుంచే వ్యతిరేకత వెల్లువెత్తుతుండడంతో బీజేపీ పార్టీతో పాటు, ఆ ఎమ్మెల్యే ఇరకాటంలో పడ్డారు. రాజస్థాన్ కి చెందిన మాజీ ఎమ్మెల్యే జయరామ్ జాటవ్ కూతురు మీనా జాటవ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి తన తండ్రికి టిక్కెట్ ఇవ్వవద్దని కోరారు.
తన ఆస్తులను కొట్టేసేందుకు స్వయానా తన తండ్రే కుట్రలు చేస్తున్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. అంతేకాకుండా తన కొడుకును కూడా చంపించాలని చూస్తున్నాడని మీనా జాటవ్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సొంత కూతురే తండ్రికి టిక్కెట్ ఇవ్వొద్దని నిరసన వ్యక్తం చేయడంతో ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.