Bihar Heat Alert:ఎండల ఎఫెక్ట్.. 2 గంటల్లోనే 16 మంది మృతి!

ఎండల ఎఫెక్ట్.. 2 గంటల్లోనే 16 మంది మృతి!

Bihar Heat Alert: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పలు రాష్ట్రాలో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

Bihar Heat Alert: దేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. పలు రాష్ట్రాలో ఏకంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

దేశంలో మార్చి నెల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. ఏప్రిల్, మే నెలలో గత రికార్డులన్నీ బద్దలు కొడుతూ గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తున్నాయి. ఎండ తాపం తట్టుకోలేక ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు. బయటకు వస్తే చల్లదనం కోసం శీతల పానియాల వైపు పరుగులు పెడుతున్నారు. ఎక్కడ నీడ ఉంటే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎండల కారణంగా కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం పూట కర్ఫ్యూ విధించినట్లే ఉంటుంది. గరిష్ట స్థాయిలో ఎండ, వేడి గాలుల కారణంగా వడదెబ్బతో విల విలలాడిపోతున్నారు. ఎండల ఎఫెక్ట్ తో పలువురు మృతి చెందిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బీహార్‌లో ఎండలు ముదిరిపోయాయి.. సూర్య ప్రతాపంతో ప్రజలు విల విలాడిపోతున్నాను. గతంలో కన్నా ఈ ఏడాది గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండిపోవడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బీహార్‌లో ఎండలకు వడదెబ్బతో ఒక్క రెండు గంటల్లోనే 16 మంది మృతి చెందారు. ఎండ ప్రభావంతో పాఠశాలల్లోని టీచర్లు, విద్యార్థులు సహా 337 మంది బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అందులో కొంతమంది వడదెబ్బ కారణంగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రాబోయే రోజుల్లో 48 డిగ్రీలు దాటే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వడగాలులు వీస్తాయంటూ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండి. ఎండల కారణంగా ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతో ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల ముందు సేద తీరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ వాడకం మరీ పెరిగిపోయి కరెంట్ అంతరాయం ఏర్పడుతుంది. ఒకేసారి గృహోపకరాలను విద్యుత్ వాడవొద్దని విద్యుత్ శాఖ సూచించింది. ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే బోర్లు, వాషింగ్ మెషన్లు వినియోగించుకోవాలని.. సాయంత్రం 6 గంటల నుంచి 11 గంటల వరకు ఫ్రిజ్, ఏసీలు నిరంతరాయంగా వాడవొద్దని.. ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. ప్రజలు అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు వెళ్లాలని సూచించారు.

Show comments