Tirupathi Rao
Big Alert For FASTag Users: ఫాస్టాగ్ గురించి కార్లు ఉన్న వారికి అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఈ పని చేయకపోతే మరో 2 రోజుల్లో మీ ఫాస్టాగ్ బ్లాక్ అవుతుంది.
Big Alert For FASTag Users: ఫాస్టాగ్ గురించి కార్లు ఉన్న వారికి అందరికీ తెలిసే ఉంటుంది. మీరు ఈ పని చేయకపోతే మరో 2 రోజుల్లో మీ ఫాస్టాగ్ బ్లాక్ అవుతుంది.
Tirupathi Rao
మనుషులకు ఆధార్ కార్డులు ఎలా ఉంటాయో.. కార్లకు ఫాస్టాగ్ అలా ఉంటుంది. కారు ఉన్న ప్రతి ఒక్కరికి ఫాస్టాగ్ అంటే ఏంటి? దాని ఉపయోగాలు ఏంటే అనే విషయంపై క్లారిటీ ఉంటుంది. కారులో జాతీయ రహదారులపై ప్రయాణం చేసే సమయంలో టోల్ ఛార్జ్ కట్టాల్సి ఉంటుంది. అందుకోసం టోల్ గేట్ వద్ద ఆగి కౌంటర్లో డబ్బు చెల్లించి వెళ్లాలి. ఈ క్రమంలో టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీ ఏర్పడేది. అలాంటి ఇబ్బందులు లేకుండా ఆన్ లైన్ విధానంలో చెల్లింపులు చేసేలా ఫాస్టాగ్ తీసుకొచ్చారు. దీనిద్వారా టోల్ గేట్ వద్ద పని చాలా సులువుగా అవుతోంది. అయితే మీరు ఈ పని చేయకపోతే జనవరి 31 తర్వాత మీ ఫాస్టాగ్ పనిచేయదు. మరి.. ఆ పనేంటో చూడండి.
టోల్ గేటు వద్ద నగదు చెల్లింపులు సులభతరంగా జరిగేందుకు, డిజిటల్ పద్ధతిలో చెల్లింపులు చేసేందుకు ఫాస్టాగ్ ని తీసుకొచ్చారు. అలాగే ఈ ఫాస్టాగ్ ద్వారా వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా అందుతుంది. అయితే ఇక్కడే ఒక సమస్య ఎదురైంది. చాలా మంది ఒకే ఫాస్టాగ్ కి చాలా కార్లను అటాచ్ చేస్తున్నారు. లేదంటే ఒకే ఫాస్టాగ్ ని చాలా కార్లకు వాడుతున్నారు. ఇలా చేయడం వల్ల టోల్ గేట్ల వద్ద ఇబ్బంది కూడా ఎదురవుతోంది. కొన్నిసార్లు విండ్ షీల్డ్ కి ఫాస్టాగ్ పెట్టనందున ఆలస్యం కూడా అవుతోంది. అంతేకాకుండా చాలామంది ఫాస్టాగ్ కి కేవైసీ చేయకుండానే వాడేస్తున్నారు.
ఒకే నంబరుపై వివిధ బ్యాంకుల్లో ఫాస్టాగ్లు కూడా తీసుకున్నారు. అలాంటి వాటిని కూడా కనిపెట్టేందుకు కేంద్రం ఇప్పుడు ఫాస్టాగ్ కు కేవైసీ విధానాన్ని తీసుకొచ్చింది. దానికి ఒక వాహనం- ఒకే ఫాస్టాగ్ అనే విధానాన్ని తీసుకొచ్చారు. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలని కేంద్రం భావిస్తోంది. దీని వల్ల ఒక ఫాస్టాగ్ మీద ఎక్కువ వాహనాలు ఉండకుండా చర్యలు తీసుకుంటోంది. అలాగే ఫాస్టాగ్స్ కి కేవైసీని కూడా పూర్తి చేయాలి. ఇందుకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జనవరి 31ని గడువు తేదీగా ప్రకటించింది. ఈ గడువులోగా వాహనదారులు మీ పాస్టాగ్ లకు కేవైసీ పూర్తి చేసుకోవాలి. చాలామంది కేవైసీ చేయకుండానే ఫాస్టాగులు జారీ చేశారు. కేవైసీ చేయకుండానే ఫాస్టాగ్ తీసుకున్న వాళ్లంతా ఇప్పుడు కేవైసీ పూర్తిచేయాలి. అలా చేయకపోతే అవి ఫిబ్రవరి 1 నుంచి బ్లాక్ అవుతాయి. లేదంటే బ్యాంకులు డీయాక్టివేట్ చేస్తారు.
అలాగే ఒకే నంబరు మీద ఎక్కువ ఫాస్టాగులు తీసుకుంటే వాటిని కూడా క్లోజ్ చేయాలి. ఒక కారుకు ఒకటే ఫాస్టాగ్ ఉండేలా చూసుకోవాలి. మిగిలినవి అన్నీ క్లోజ్ చేయాలి. కేవైసీ చేయకపోతే అవి ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతాయి. కేవైసీ చేసుకునేందుకు https://fastag.ihmcl.com ని సందర్శించాలి. అక్కడ మీ ఫాస్టాగ్ రిజిస్టర్ నంబర్ ని టైప్ చేసి పాస్ వర్డ్ లేదా ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మీ ప్రొఫైల్ లో కేవైసీ అనే సెక్షన్ లో మీ వివరాలను, డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ డాక్యుమెంట్లు, వివారుల సబ్మిట్ చేసిన తర్వాత 7 వర్గింగ్ డేట్స్ లోపు మీ కేవైసీ రిక్వెస్ట్ పూర్తవుతుంది. మీరు ఫాస్టాగ్ అధికారిక వెబ్ సైట్ లో వివరాలను తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కేవైసీ చేయడం మాత్రమే కాకుండా.. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేసి వారిని అలర్ట్ చేయండి.