iDreamPost
android-app
ios-app

హథ్రాస్ తొక్కిసలాటపై భోలే బాబా రియాక్షన్.. కఠినంగా శిక్షించాలంటూ!

Bhole Baba First Recation On Hathras Stampehed: జులై 2న ఉత్తర్ ప్రదేశ్ హథ్రాస్ లో జరిగిన తొక్కిసలాటపై భోలే బాబా తొలిసారి స్పందించారు. ఆ దుర్ఘటనకు సంబంధించి మాట్లాడటమే కాకుండా.. కారుకలను కఠినంగా శిక్షించాలి అన్నారు.

Bhole Baba First Recation On Hathras Stampehed: జులై 2న ఉత్తర్ ప్రదేశ్ హథ్రాస్ లో జరిగిన తొక్కిసలాటపై భోలే బాబా తొలిసారి స్పందించారు. ఆ దుర్ఘటనకు సంబంధించి మాట్లాడటమే కాకుండా.. కారుకలను కఠినంగా శిక్షించాలి అన్నారు.

హథ్రాస్ తొక్కిసలాటపై భోలే బాబా రియాక్షన్.. కఠినంగా శిక్షించాలంటూ!

దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురయ్యేలా చేసిన ఘటన హథ్రాస్ తొక్కిసలాట. ఈ దుర్ఘటనలో ఏకంగా 121 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. హథ్రాస్ లో భోలే బాబా పాద ధూళి కోసం అంతా ఒక్కసారిగా ముందుకు వెళ్లగా తొక్కిసలాట జరిగింది. అక్కడ ఏర్పాట్లను పరిశీలించిన దేవ్ ప్రకాశ్ మధుకర్ తాజాగా పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆ ఘటన తర్వాత భోలే బాబా ఎవరికీ కనిపించలేదు. అయితే ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. అంతేకాకుండా ఆ దుర్ఘటనకు సంబంధించి స్పందించారు. కారకులను కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేశారు.

జులై 2న ఉత్తర్ ప్రదేశ్ లోని హథ్రాస్ లో పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. ఆ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అప్పుడే ఈ భోలే బాబా పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఆ ఘటన తర్వాత ఆయన ఎవరికీ కనిపించలేదు. ఇప్పుడు తొలిసారి ఆయన మీడియా ముందుకు వచ్చి.. ఆ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “జులై 2న జరిగిన తొక్కిసలాట ఘటనపై మేము చాలా చింతిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో బాధను బరించే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని వేడుకుంటున్నాను. నాకు ప్రభుత్వంపై విశ్వాసం ఉంది. ఈ తొక్కిసలాటకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను. వాళ్లు శిక్ష నుంచి తప్పించుకోలేరని నేను నమ్ముతున్నాను. ఈ తొక్కిసలాటలో చనిపోయిన వారి కుటుంబాలు, క్షతగాత్రుల కుటుంబాలకు మద్దతుగా నిలవాలని కమిటీకి సూచించాను” అంటూ భోలే బాబా మీడియాకి తెలిపారు.

హథ్రాస్ లోనే కాకుండా అలీగఢ్ లోని పలు జిల్లాల్లో ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమాలకు సత్సంగ్ అని పేరు ఉంటుంది. అక్కడికి తరచూ 80 వేల వరకు భక్తులు హాజరవుతూ ఉంటారు. కానీ, కొన్నిసార్లు మాత్రం లక్షల్లో జనాలు వస్తూ ఉంటారు. ‘సేవాసదర్ ఆర్మీ’ అనే వ్యక్తులు ఈ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. జులై 2వ తేదీన కార్యక్రమానికి వాళ్లు 80 వేల మందికి ఏర్పాట్లు చేశారు. కానీ, అక్కడికి ఏకంగా 2.5 లక్షల మంది జనం వచ్చారు. అక్కడే తొక్కిసలాట జరిగింది. జులై 2న సత్సంగ్ ముఖ్య సేవాదర్ గా ఉన్న దేవ ప్రకాశ్ మధుకర్ శుక్రవారం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ కేసులో అతనే ఏ1 ముద్దాయిగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హథ్రాస్ తొక్కిసలాట.. భోలే బాబా రియాక్షన్ వైరల్ అవుతోంది. మరి.. కారకులకు శిక్ష పడాలి అంటూ చేస్తున్న భోలే బాబా డిమాండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.