Arjun Suravaram
Raksha Bandhan 2024: రాఖీ పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు కచ్చితంగా రాఖీ కడతారు. ఈ నేపథ్యంలో ఇంట్లో తయారు చేసుకునే రాఖీలు పండగను మరింత సంతోషం కలిగించేలా చేస్తాయి.
Raksha Bandhan 2024: రాఖీ పండుగ భారతదేశంలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను రాఖీ పౌర్ణమి లేదా రక్షా బంధన్ అని కూడా పిలుస్తారు. రాఖీ పండుగ రోజున అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లు కచ్చితంగా రాఖీ కడతారు. ఈ నేపథ్యంలో ఇంట్లో తయారు చేసుకునే రాఖీలు పండగను మరింత సంతోషం కలిగించేలా చేస్తాయి.
Arjun Suravaram
హిందూ పంచాంగం ప్రకారం ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండగ జరుపుకుంటారు. దీనిని శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, జంధ్యాల అని పిలుస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ రాఖీ వేడుకలను జరుపుకుంటారు. అక్కాతమ్ముడు, అన్నా చెల్లికి మధ్య ఉంటే ప్రేమానురాగానికి గుర్తుగా ఈ పండగను జరపుకుంటారు. అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి..తమ ప్రేమను చాటి చెబుతుంటారు. ఏటా మాదిరిగానే ఈ సారి కూడా ఆగష్టు 19న రాఖీ పండగ రానుంది. ఈ నేపథ్యంలో తమ సోదరులకు వెరైటీ రాఖీలు కట్టేందుకు అమ్మాయి సిద్ధమవుతున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 19న సోమవారం రాఖీ పండగ వచ్చింది. తమ సోదరులకు ఈ పండగకోసం ప్రత్యేకంగా ఏమైనా చేయాలని భావిస్తుంటారు. చాలా మంది బయట మార్కెట్ లో దొరికే వివిధ రకాల రాఖీలను తెచ్చి…సోదరులకు కట్టేందుకు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో మరికొందరు తమ సొంతంగా రాఖీలు తయారు చేసి..తన సోదరుడికి కట్టాలని భావిస్తుంన్నారు. అలా రాఖీలు బయట మార్కెట్ నుంచి తెచ్చి కట్టకుండా మీ చేతుల్తోనే రాఖీ తయారు చేస్తే…ఆ రాఖీలు పండగ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. మన సొంతంగా తయారు చేసిన రాఖీ సోదరుడి చేతికి చూస్తే మరింత అందగా అనిపిస్తుంది. బియ్యం, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో వెరైటీ రాఖీలను తయారు చేయవచ్చు.
బియ్యంతో రాఖీని అందంగా తయారు చేయవచ్చు. దానికోసం చిన్న అట్టముక్కను గుండ్రంగా లేదా మనకిష్టమైన ఆకారంలో కత్తిరించాలి. దానిపై బియ్యం అతికించాలి. మధ్యలో ఇంట్లో ఉండే కుందన్ ఏదైనా అతికించండి. అలా మొత్తంగా బియ్యంతో రాఖీని సిద్ధం చేయవచ్చు. కాజూ, బాదాం, ఎండు ద్రాక్ష, పిస్తా, పిస్తా పొట్టు వంటి పలు రకాల డ్రైఫ్రూట్స్ తో కూడా మంచి రాఖీ చేయొచ్చు. అట్టముక్క మీద వీటిని అతికిస్తే సరిపోతుంది. వీటితోనే కాకుండా ఇంట్లో మనం వినియోగించే మసాలా దినుసులతోనూ చేయొచ్చు. లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, గుమ్మడి గింజలు లాంటి వాటితో కూడా మంచి ఆకారం తయారు చేసి రాఖీ చేయొచ్చు.
పేపర్ క్విల్లింగ్ రాఖీని తయారు చేయడం చాలా సులువు. సన్నంగా ఉండే రంగు కాగితాల్ని చుట్టి రకరకాల ఆకారాలు తయారు చేయొచ్చు. దీన్ని మరింత అందంగా మార్చడానికి మెటాలిక్ పెయింట్లను కూడా వినియోగించవచ్చు. అలానే క్లే తో కూడా రాఖీ తయారు చేయవచ్చు. దానికి విభిన్నమైన రంగులు జోడిస్తే అదిరిపోయే రాఖీ రెడీ అవుతుంది. మొత్తంగా ఇలా మీరు సొంతంగా రాఖీ తయారు చేసి..రాఖీ పండను మరింత సంతోషంగా జరుపుకోవచ్చు. ఈ సారి మీరు కూడా స్వయంగా రాఖీని తయారు చేసి..మీ సోదరుడికి సర్ ప్రైజ్ ఇవ్వండి.