iDreamPost
android-app
ios-app

రేపు రాఖీ రోజు ఇది ఫాలో అవ్వండి! ఈ సమయంలో రాఖీ కట్టొద్దు!

  • Published Aug 18, 2024 | 12:49 PM Updated Updated Aug 18, 2024 | 12:49 PM

Raksha Bandhan 2024: అన్నా చెల్లెళ్లు తమ సోదరులకు ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగ రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అంటారు. పురాణాల ప్రకారం ఈ పండుగ కృత యుగం నుంచి ఆచరిస్తున్నారని అంటారు.

Raksha Bandhan 2024: అన్నా చెల్లెళ్లు తమ సోదరులకు ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగ రక్షా బంధన్ లేదా రాఖీ పౌర్ణమి అంటారు. పురాణాల ప్రకారం ఈ పండుగ కృత యుగం నుంచి ఆచరిస్తున్నారని అంటారు.

  • Published Aug 18, 2024 | 12:49 PMUpdated Aug 18, 2024 | 12:49 PM
రేపు రాఖీ రోజు ఇది ఫాలో అవ్వండి! ఈ సమయంలో రాఖీ కట్టొద్దు!

రాఖీ పండుగ అంటే తెలుగు వారికి ఎంతో ఇష్టమైనది.. అక్కా చెల్లెళ్లు.. తమ సోదరుల చేతికి ‘రాఖీ’ కట్టి పది కాలలపాటు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనసారా దీవిస్తుంటారు. తమ సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకి ఆత్మీయత మరింత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పలా కాపాడుకోవడానికి సిద్దంగా ఉంటారు. రాకీ పండుగ అనేది ప్రాచీన హిందువుల పండుగ.. ఇది కృత యుగం నుంచి ఆచరిస్తున్నారని పెద్దలు అంటుంటారు. ప్రతి యేటా రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున వస్తుంది. ఈ పండుగ సందర్భంగా తన సోదరుల చేతి మణికట్టుకు రాఖీ కడతారు. రాఖీ కట్టినందుకు తమ అక్కాచెల్లెళ్లకు తమస్థాయికి తగ్గట్టు డబ్బులు, చీర, ఇతర కానుకలు ఇస్తుంటారు సోదరులు. అయితే రాఖీ కట్టడానికి కొన్ని సమయాలు ఉంటాయి.. ఆ సమయాల్లో రాఖీ కట్టాలని పండితులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..

శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, రక్షా బంధన్ ఇది అన్నా చెల్లెళ్లు.. అక్కా తమ్ముళ్ల పండగ. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని హిందువులు ఎంతో ప్రేమానురాగాలతో జరుపుకునే పండగ రక్షా బంధన్. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమి నాడు ఈ పండుగ వస్తుంది. బాల్యంలో తమతో ఆడిపాడిన అన్నదమ్ములకు అక్కాచెలెళ్లు ప్రతి యేటా రాఖీ కట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంద్యాల పూర్ణిమ అని కూడా అంటారు.ఈ ఏడాది (2024) రాఖీ పండుగ సోమవారం, ఆగస్టు 19న వస్తుంది. అన్నదమ్ములకు ఏ సమయాల్లో రాఖీ కట్టాలి, ఏ సమయంలో కట్ట కూడదు అనేదానిపై పండితులు కీలక విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దాం.   రాఖీ దారం సాధారణ పత్తిదారం నుంచి సిల్క్ దారం కావొచ్చు లేదా బంగారం, వెండి వంటి విలువైన లోహంతో తయారు చేసినవి కావొచ్చు.. ఏదైనా తమ సోదరుల మణికట్టుకు కడతారు ఆడపడుచులు. సాధారణంగా సిస్టర్స్ తమ సోదరులకు రాఖీ కట్టడం ఆనవాయితీ.. కానీ బ్రహ్మణులు, గురువులు భక్తులకు, శిష్యులకు దీవెనల వల్ల కట్టవొచ్చు.

ఈ సమయాల్లో రాఖీ కట్టకూడదు :

ఈ సంవత్సరం రాఖీ పండుగ ఆగస్టు 19, సోమవారం నాడు వస్తుంది. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం.. ఆ రోజు ఉదయం 5:52 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు భద్రకాలం ఉంది. ఆ సమయంలో రాఖీ కట్టడం అన్నదమ్ములకు శుభం కాదని.. ఒకవేళ ఈ భద్రకాలంలో రాఖీ కడితే దోషమని పండితులు హెచ్చరిస్తున్నారు. సోదరులపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుందని అంటున్నారు. అందుకే అక్కా చెల్లెళ్లు ఈ సమయాన్ని దృష్టిలో ఉంచుకుంటే మంచిది అని పండితులు చెబుతున్నారు.

ఈ సమయాల్లో రాఖీ కట్టకూడదు :

రాఖీ కట్టడానికి మంచి సమయంల మధ్యాహ్నం 1:32 తర్వాత ప్రారంభం అవుతుంది. సాయంత్రం 4:21 వరకు ఎప్పుడైన కట్టవొచ్చు. అలాగే సాయంత్రం 6:56 నుంచి రాత్రి 9:08 వరకు ఉండో ప్రదోష కాలాంలో అన్నదమ్ములకు రాఖీ కడితే మంచిదని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 19 న ఉపాకర్మ,యజ్ఞోపవితం వంటి శుభకార్యాలు చేయడానికి మంచి సమయం అంటున్నారు. ఈ రోజు భద్రకాలం ఈ కార్యక్రమాలను ప్రభావితం చేయలేదు అని అంటున్నారు. అందుకే ఈ రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఎప్పుడైనా ఈ కార్యక్రమాలు చేపట్టవొచ్చు. సోదరులకు రాఖీ కట్టే సమయం మాత్రం తప్పకుండా గమనించాలి. తద్వారా రాఖీ పండుగ ఆనందంగా జరుపుకోవచ్చు అంటున్నారు పండితులు.