బ్రేకింగ్: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు కేసు.. NIA అదుపులో కీలక నిందితుడు

Rameswaram Cafe accused in NIA Custody: ఈ మధ్య బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ వద్ద పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు విషయంలో ఎన్ఐఏ పురోగతి సాధించింది.

Rameswaram Cafe accused in NIA Custody: ఈ మధ్య బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ వద్ద పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసు విషయంలో ఎన్ఐఏ పురోగతి సాధించింది.

ఇటీవల దేశంలో పలు చోట్ల ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రదేశాలను ఎంచుకొని బాంబులతో దాడులు చేస్తున్న ఘటనలను తరుచూ జరుగుతూనే ఉన్నాయి. అంతేకాదు దేశంలోని ముఖ్యనగరాల్లో స్కూల్స్, బస్టాండ్స్, రైల్వే స్టేషన్, షాపింగ్ మాల్స్, పార్కుల్లో బాంబులు పెట్టినట్లు ఫోన్ కాల్స్, మెయిల్స్ పంపుతూ బెదిరింపులకు పాల్పపడుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమైన బాంబు స్క్యాడ్, జాగిలాలతో వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ అనుమానాస్పదంగా ఏదీ లభించకపోవడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో జరిగిన పేలుడు ఘటనలో ఎన్ఐఏ పురోగతి సాధించినట్లు వార్తలు వస్తున్నాయి.

బెంగుళూరులోని రామేశ్వరం కేఫ్ లో పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో సిబ్బంది సహ పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛాలెంజ్ గా తీసుకుంది. ఈ క్రమంలోనే నింధితుడిని పట్టుకునేందుకు ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయిన ఫోటోలను రిలీజ్ చేసింది. ఈ క్రమంలోనే బుధవారం కర్ణాటకలోని బళ్లారికి చెందిన షబ్బీర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీటీవీలో రికార్డు అయిన వ్యక్తి అతడేనా? కాదా? అన్న విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు సదరు వ్యక్తిని విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్ లో మార్చి 1 శుక్రవారం పేలుడు ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడులో పది మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత సీసీ‌టీవీలో రికార్డులు అయిన దృశ్యాల్లో మాస్క్, క్యాప్ ధరించిన ఓ వ్యక్తి బస్సు దిగి కేఫ్ కి వచ్చినట్లుగా గుర్తించారు. కేఫ్ లో పేలుడు ఘటన జరిగిన తర్వాత సదరు వ్యక్తి తిరిగి బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని ఎన్ఐఏ అధికారులు గ్రూపులుగా విడిపోయి నిందితుడి ని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే చుట్టు పక్కట ప్రాంతాలన్నీ జల్లెడ పట్టినట్లు తెలుస్తుంది. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నజరానా కూడా ప్రకటించింది. మొత్తానికి ఘటన జరిగిన 13 రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Show comments