హెల్మెట్ లేదని అడిగినందుకు ఎంత పని చేశాడంటే? వీడియో వైరల్

Man Assaults Traffic Police: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎన్నిసార్లు హెచ్చరించినా కొంతమంది పట్టించుకోరు.. పైగా ట్రాఫిక్ సిబ్బందిపై తిరగడుతుంటారు.

Man Assaults Traffic Police: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎన్నిసార్లు హెచ్చరించినా కొంతమంది పట్టించుకోరు.. పైగా ట్రాఫిక్ సిబ్బందిపై తిరగడుతుంటారు.

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతి వేగం, అనుభవ రాహిత్యం ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించడం లాంటివి చేస్తున్నారు. కానీ వాహనదారులు మాత్రం తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూనే ఉన్నారు. ఒక్కోసారి ట్రాఫిక్ సిబ్బందిపై తిరగబడుతుంటారు. అలాంటి ఘటనే బెంగ‌ళ‌రూలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరులో ఓ విచిత్ర ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నగరానికి చెందిన సయ్యద్ సఫీ (28) అనే యువకుడు హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతున్నాడు. విల్సన్ గార్డెన్ వద్ద అది గమనించిన ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని ఆపారు. అదే సమయంలో ఓ కానిస్టేబుల్ సఫీ స్కూటీ కీ  తీసుకున్నాడు.. మరో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు. తన కీ ఇవ్వాలని సయ్యద్ సఫీ ట్రాఫిక్ పోలీస్ పై గొడవకు దిగాడు.. అంతేకాదు తన తాళం ఇవ్వాలని బలవంతంగా పోలీస్ చేతి వేలుని కూడా కొరికాడు. అంతే బాధతో ట్రాఫిక్ కానిస్టేబుల్ కీ వదిలివేయడంతో తన స్కూటీని తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నించాడు.

ఈ తతంగాన్ని అక్కడ ఓ వ్యక్తి నిలదీయగా అతనిపై ఫైర్ అయ్యాడు. తనని అనవసరంగా ఆపారని, ఎంతోమంది హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని పట్టించుకోకుండా తనను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారని ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు సయ్యద్ సఫీ. అంతేకాదు మరో ట్రాఫిక్ పోలీస్ నువు ఎందుకు వీడియో తీస్తున్నావు అంటు చేతిలోని సెల్ లాక్కున్నాడు. అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడి చేయడం, దుర్భాషలాడటం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.

Show comments