Arjun Suravaram
Karnataka News: ఏసీలను వినియోగించే వారు కాస్తా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ద చేసిన కూడా ప్రాణాలకే ప్రమాదం. అలానే ఓ దంపతులు ఏసీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..
Karnataka News: ఏసీలను వినియోగించే వారు కాస్తా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ద చేసిన కూడా ప్రాణాలకే ప్రమాదం. అలానే ఓ దంపతులు ఏసీ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే..
Arjun Suravaram
ప్రతి ఒక్కరు తమ దాంపత్య జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అందుకే తమకు నచ్చిన వారిని ఏరికోరి చేసుకుంటారు. అలా ఎంతో మంది సంసార జీవితంలో సంతోషంగా సాగిపోతున్నారు. ఇలానే ఓ భార్యాభర్తలు కూడా ఇద్దరి పిల్లలతో ఎంతో హాయిగా జీవితాన్ని సాగిస్తున్నారు. ఇక సొంత వ్యాపారం ఉండటంతో వారికి ఇతర ఆర్థిక కష్టాలు కూడా పెద్దగా లేవు. అయితే విధి ఆడిన వింతనాటకంలో ఆ దంపతులు మంటల్లో కలిసిపోగా..వారి ఇద్దరు పిల్లలు అనాథగా మారారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కర్నాటక రాష్ట్రం ఉడిపి ప్రాంతానికి చెందిన అశ్వినీ శెట్టి(47), రామానంద శెట్టి(52) భార్యాభర్తలు. వీరు బారును నిర్వహిస్తున్నారు. అశ్వినీ శెట్టి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలానే ఆమె రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పని చేస్తుంది. ఆమె కుటుంబం మంగళురు సమీపంలోని ఉడిపిలో నివాసం ఉంటుంది. ఇద్దరు పిల్లలతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలో సోమవారం పెను విషాదం చోటుచేసుకుంది. ఆదివారం నిద్రకు ఉపక్రమించిన ఆ దంపతులు..సోమవారం ఉదయం అగ్నికి బలయ్యారు. సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో వారి ఇంట్లోని ఏసీలో మంటలు చెలరేగాయి. అది సరిగ్గా పని చేయకపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి..ఈ మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఈ ప్రమాదంలో రామానంద శెట్టి అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అశ్విని శెట్టి మంగళవారం సాయంత్రం మృతి చెందారు. ఇక ఈ అగ్నిప్రమాదం జరిగిన సమయంలో వారి ఇద్దరు పిల్లలు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వేరే గదిలో నిద్రిస్తున్నారు. ఆ బెడ్ రూమ్ లాక్ కావడంతో త్వరగా మంటలు వ్యాపించలేదు. ఇదే సమయంలో వెంటిలెటర్ మార్గం నుంచి ఆపిల్లలద్దరు బయటకు దూకి..ప్రాణాలతో బయట పడ్డారు. ఇక వీరి మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వారు ఏసీ సరిగ్గా పనిచేయలేదని గుర్తించిన వెంటనే రిపైర్ చేయించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు చెబుతున్నారు. ఇలా ఎవరైనా ఏసీ విషయంలో పొరపాటు చేయవద్దని నిపుణలు చెబుతున్నారు. ఇలా ఏసీల కారణంగా తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
నిత్యం ఏదో ఒక ప్రాంతలో వివిధ కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈక్రమంలో ఎంతో మంది అమాయకులు అగ్నికి ఆహుతవుతున్నారు. మరెందరో తీవ్రమైన గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. అలానే ఇటీవల సమ్మర్ టైమ్ లో పలు ఎలక్ట్రిక్ వస్తువులు పేలిపోయాయి. అలానే మరికొన్ని షార్ట్ సర్క్యూట్ జరిగి.. అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. అలానే తాజాగా అశ్వీని దంపతులు ఏసీ కారణంగా మృత్యుఒడిలోకి చేరారు. ఇలాంటి ఘటన నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.