iDreamPost
android-app
ios-app

నిన్న సీమా, నేడు సానియా.. ప్రియుడి కోసం దేశాలు దాటి..

  • Author Soma Sekhar Published - 03:15 PM, Tue - 22 August 23
  • Author Soma Sekhar Published - 03:15 PM, Tue - 22 August 23
నిన్న సీమా, నేడు సానియా.. ప్రియుడి కోసం దేశాలు దాటి..

ప్రేమకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదు. ఈ విషయం ఎన్నో సినిమాల్లో మనం చూశాం. అదీకాక నేటి సమాజంలో రోజూ చూస్తూనే ఉన్నాం. ఇక ఈ మధ్య కాలంలో సరిహద్దులు దాటిన ప్రేమ కథ ఒకటి దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ప్రేమ కోసం దేశ సరిహద్దులను లెక్క చేయకుండా.. పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చింది సీమా హైదర్. ఈ న్యూస్ ఎంత వైరల్ గా మారిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ప్రేమ కథపై ఓ సినిమా కూడా తీస్తున్నారు కూడా. తాజాగా ఇలాంటి మరో ప్రేమ కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. తన భర్త కోసం బంగ్లాదేశ్ నుంచి వచ్చింది ఓ యువతి. ఈ ప్రేమ కథకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

సీమా హైదర్.. పాకిస్థాన్ నుంచి తన లవర్ కోసం ఇండియా వచ్చింది. ఈ ప్రేమ కథను జనాలు మరచిపోకముందే.. అచ్చం అలాంటి కథే మరోటి వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి బంగ్లాదేశ్ కు చెందిన ప్రియురాలు తన ప్రియుడిని వెతుక్కుంటూ వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సానియా అక్తర్ బంగ్లాదేశ్ కు చెందిన యువతి. ఈమెకు ఇండియాలోని నోయిడాకు చెందిన వ్యక్తి సౌరభ్ కాంత్ తో మూడేళ్ల క్రితం వివాహం జరిగినట్లు, వీరికి ఏడాది వయసున్న కొడుకు ఉన్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన సానియా ఈ విధంగా చెప్పుకొచ్చింది.

“మూడేళ్ల క్రితం నాకూ, సౌరభ్ కాంత్ కు వివాహం జరిగింది. మాకు ఓ బాబు కూడా పుట్టాడు. అతడిని వెతుక్కుంటూ నేను ఇండియా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక అతడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. నేను మా పెళ్లి గురించి నిలదీస్తే.. ఎవరో తెలీనట్లు ప్రవర్తిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. అతడిని వదిలిపెట్టేది లేదని, సెక్టర్ 108లో ఉన్న పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకుని అతడిపై ఫిర్యాదు చేశానని” ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయమై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సానియా తెలిపిన వివరాల ప్రకారం.. సౌరభ్ కాంత్ బంగ్లాదేశ్ లోని ఢాకా పట్టణంలో కల్టీ మ్యాక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి వరుసగా సరిహద్దు దాటి వస్తున్న ప్రేమ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: చికెన షాపులో కొండ చిలువ కలకలం! నాలుగు కోళ్లను తిని..

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş