iDreamPost

చికెన షాపులో కొండ చిలువ కలకలం! నాలుగు కోళ్లను తిని..

చికెన షాపులో కొండ చిలువ కలకలం! నాలుగు కోళ్లను తిని..

సాధారణంగా కొండ చిలువలు దట్టమైన అడవుల్లో, నదీ పరివాహక ప్రాంతంలో తిరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడు ఊర్లలో, రహదారులపై కనిపిస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తుంటాయి. అంతేకాక కొన్ని సందర్భాల్లో ఈ కొండ చిలువ మూగ జీవాలను చంపేస్తుంటాయి.  ఇంకా దారుణం ఏమిటంటే.. ఇళ్లలో కూడా ఈ కొండ చిలువ ప్రత్యక్షమవుతున్నా. తాజాగా ఓ వ్యక్తి చికెన్ సెంటర్ లో కనిపించి కలకలం రేపింది. అక్కడ  ఉన్న ఓ డ్రమ్ములో ఈ కొండ చిలువ ఉంది. అంతేకాక నాలుగు బాయిలర్ కోళ్లను తినేసింది. ఈ ఘటన శ్రీసత్య సాయి పుటపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

శ్రీ సత్యసాయి జిల్లాలోని పుటపర్తి మండలం పరిధిలో ఎనుములపల్లి చెరువు సమీపాన చిత్రావతి బైపాస్ రోడ్డును ఆనుకుని ముక్తార్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ ను నిర్వహిస్తున్నాడు. ఆదివారం కూడా చికెన్ సెంటర్ ను  నడిపి.. సాయంత్ర మూసేసి ఇంటికి వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం షాపుకు వచ్చిన ముక్తర్.. నీళ్లు పట్టేందుకు డ్రమ్ము వద్దకు వెళ్లాడు. అక్కడ  ఉన్న డ్రమ్ము మూత తెరిచి చూసి షాకయ్యాడు. అందులో చుట్టవేసుకుని కొండ చిలువ ఉంది. అయితే నాలుగు బ్రాయిలర్ కోళ్లను తినేసిన తరువాత నీటి డ్రమ్ములోకి  చేరుకున్నట్లు ముక్తర్ తెలిపాడు.

షాపుకు వెనుక ఉన్న కొండల్లో నుంచి ఆదివారం రాత్రి ఈ కొండ చిలువ చికెన్ షాపులోకి ప్రవేశించినట్లు స్థానికులు భావిస్తున్నారు. ఈ కొండ చిలువ దాదాపు తొమ్మిది అడుగుల పొడవు ఉంది. తొలుత కొండ చిలువను చూసి ముక్తర్ భయభ్రాంతులకు గురై… అక్కడి నుంచి బయటకు పరుగు తీశాడు. స్థానికులు  చెప్పడంతో వారు పుట్టపర్తికి చెందిన స్నేక్ క్యాచర్ మూర్తికి సమాచారం ఇచ్చారు. దీంతో మూర్తి అక్కడికి చేరుకుని కొండ చిలువను చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. మరి.. అటవీ జంతువులు గ్రామాల్లోకి తరచూ వస్తుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రియుడిని మరువలేక.. ప్రియురాలు ఊహించని పని!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి