బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఊహించని ట్విస్ట్! FIRలో కనిపించని వారి పేర్లు!

Bangalore Rave Party: బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇక ఈ కేసులో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

Bangalore Rave Party: బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్‌ పార్టీ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇక ఈ కేసులో ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం శివారు ఎలక్ట్రానిక్‌ సిటీలోని ఓ ఫామ్‌హౌజ్‌లో ఆదివారం రాత్రి జరుగుతున్న రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. రేవ్‌ పార్టీ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ రేవ్‌ పార్టీలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు రావడం గమనార్హం. సుమారు 150 వరకు ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్నారని.. పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం ఈ ఫామ్‌హౌజ్‌ను బుక్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఇక తాజాగా రేవ్‌ పార్టీ కేసులో కీలక ట్విస్ట్‌ చోటు చేసుకుంది. ఆ వివరాలు..

ఈ రేవ్‌ పార్టీలో దొరికిన సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లను పోలీసులు.. ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని తెలుస్తోంది. ఈ పార్టీలో సుమారు 100-150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని.. బెంగళూరు పోలీసులు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ రేవ్‌ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన సినీ నటీనటులతో పాటు.. వ్యాపార, రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారని సమాచారం. పార్టీలో నిషేధిత డ్రగ్స్‌ 17 గ్రాముల ఎండీఎంఏతో పాటు గంజాయి వాడినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక 20కి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక పార్టీకి హాజరైన వారి నుంచి రక్త నమూనాలను సేకరించి.. పరీక్షలకు పంపారు పోలీసులు.

సన్‌సెట్‌ టూ సన్‌ రైజ్‌ విక్టరీ పేరుతో వాసు బర్త్‌డే పార్టీ నిర్వహించారని తెలుస్తోంది. పార్టీకి తెలుగు టీవీ ఆర్టిస్ట్‌లు, మోడల్స్ హాజరైనట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరితో పాటు టెక్కీలు, 25 మంది యువతులు హాజరయ్యారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. వీరిలో సిద్ధిఖీ, రణధీర్, రాజులను డ్రగ్స్ పెడ్లర్లుగా గుర్తించారు. ఇక హీరో శ్రీకాంత్‌ ఈ రేవ్‌ పార్టీలో పాల్గొన్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ తాను ఇలాంటి పార్టీలకు దూరం అని.. ఇంట్లోనే ఉన్నానంటూ హీరో శ్రీకాంత్‌ హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి వీడియో రిలీజ్‌ చేశారు. ఇక నటి హేమ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. పార్టీకి వెళ్లిన హేమ.. తాను ఇంట్లో ఉన్నట్లు వీడియో రిలీజ్‌ చేసింది. అయితే హేమ పార్టీకి వచ్చిందని బెంగళూరు పోలీసులు తెలిపారు.

Show comments