iDreamPost
android-app
ios-app

అయోధ్య రామ మందిరానికి అరుదైన కానుక.. ఒకే గడియారంలో 9 దేశాల సమయాలు

  • Published Jan 05, 2024 | 3:26 PMUpdated Jan 05, 2024 | 3:57 PM

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరానికి ఓ వ్యక్తి అరుదైన కానుక ఇచ్చాడు. గడియారాన్ని బహుకరించాడు. దాని ప్రత్యేకత ఏంటంటే..

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరానికి ఓ వ్యక్తి అరుదైన కానుక ఇచ్చాడు. గడియారాన్ని బహుకరించాడు. దాని ప్రత్యేకత ఏంటంటే..

  • Published Jan 05, 2024 | 3:26 PMUpdated Jan 05, 2024 | 3:57 PM
అయోధ్య రామ మందిరానికి అరుదైన కానుక.. ఒకే గడియారంలో 9 దేశాల సమయాలు

సాధారణంగా మనం చేతికి పెట్టుకునే గడియారమైనా.. ఇంట్లో ఉండే క్లాక్ అయినా సరే.. ఒక్కటే సమయాన్ని చూపిస్తుంది. మన దగ్గర అనే కాదు.. ప్రపంచంలో ఎక్కడైనా సరే గడియారం అంటే ఆ ప్రాంతం సమయాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇక పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో వేర్వేరు దేశాల సమయాలను తెలిపేందుకు గాను 5, 6 గడియారాలను గోడకు తగిలిస్తారు. అంతే తప్ప ఒకే గడియారంలో వేర్వేరు దేశాల సమయాలను చూసే అవకాశం అయితే ఉండదు. ఈ తరహా గడియారాలను ఇప్పటి వరకైతే మార్కెట్ లోకి రాలేదు. కానీ అయోధ్య రామ మందిరానికి ఇలాంటి అరుదైన కానుక ఒకటి వచ్చింది. ఈ గడియారంలో ఇండియాతో కలిపి ఒకే సారి 8 దేశాల సమయాలు తెలుసుకోవచ్చు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి.. దీన్ని తయారు చేశాడు. ఆ వివరాలు..

త్వరలోనే అయోధ్య భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం కాబోతుంది. ఈ నెల 22వ తేదీన రామ మందిరం ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా భక్తులు రామ మందిరానికి భారీ ఎత్తున కానుకలు, విరాళాలు పంపిస్తున్నారు. విదేశాల నుంచి సైతం రామ మందిరానికి కానుకలు, విరాళాలు వస్తున్నాయి.

Times of 9 countries in one clock

ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ కు చెందిన అనిల్ కుమార్ సాహు(52) అనే కూరగాయల వ్యాపారి.. రామ మందిరానికి అరుదైన కానుక బహుకరించాడు. ఇండియాతో పాటు మరో 8 దేశాల సమయాలను తెలిపే గడియారాన్ని బహుకరించాడు. 75 సెంమీ వ్యాసం ఉన్న అరుదైన గడియారాన్ని రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కి అందించాడు.

ఇండియాతో పాటు మరో 8 దేశాలు..

ఈ సందర్భంగా అనిల్ కుమార్ సాహు మాట్లాడుతూ.. “గతేడాది అక్టోబర్ నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ గడియారం తయారీ ప్రారంభించాను. గతంలో లక్నోలోని ఖతు శ్యామ్ ఆలయం, బారంకీలోని కొత్వా ధామ్, కుంటేశ్వర్ మహదేవ్ ఆలయాలకు కూడా ఇలాంటి గడియారాలను బహుకరించాను. దీనిలో ఇండియాతో పాటు.. దుబాయ్, టోక్యో(జపాన్), మాస్కో(రష్యా), బీజింగ్(చైనా), సింగపూర్, మెక్సికో సిటీ(మెక్సికో), వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్(అమెరికా) 8 ప్రాంతాల సమయాలను తెలుసుకోవచ్చు” అని తెలిపాడు.

అంతేకాక “2018 నుంచి ఇలాంటి గడియారాలను తయారు చేయడం ప్రారంభించాను. భవిష్యత్తులో 25 దేశాల సమయాలను తెలిపే గడియారం తయారు చేయాలన్నదే నా కోరిక. ప్రస్తుతం నేను తయారు చేసిన 9 దేశాల సమయాలు తెలిపే గడియారానికి సంబంధించి ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందాను. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ లతో పాటు నా దగ్గర వెల్లుల్లి కొనే గోమతినగర్ నివాసి హిమాన్షు వర్మకు ఈ గడియారాలను బహుకరించాలనుకుంటున్నాను” అని తెలిపాడు.

ఒకే గడియారంలో వివిధ దేశాల సమయాలను తెలుసుకునేలా ఓ గడియారం తయారు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అని ప్రశ్నించగా.. అనిల్ కుమార్ బదులిస్తూ.. “నేను లక్నో వెళ్లినప్పుడు.. అక్కడ హోటల్ రిసెప్షన్ లో వేర్వేరు దేశాల సమయాలను తెలుసుకునేందుకు గాను.. 4,5 గడియారాలను ఏర్పాటు చేశారు. వాటిని చూసినప్పుడు నాకు ఒకే గడియారంలో అన్ని దేశాల సమయాలు తెలుసుకోలేమా అన్న ఆలోచన వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు చేసి.. ప్రస్తుతం ఇండియాతో పాటు 8 దేశాల సమయాలు తెలిపే గడియారాన్ని తయారు చేశాను” అన్నాడు

“వీటిని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి.. అమ్మాలని నాకు ఉంది. కానీ అందుకు సరిపడా నిధులు నా దగ్గర లేవు. 75 సెంమీ ఉన్న ఈ గడియారం ఖరీదు 3 వేల రూపాయలు. దీన్ని తయారు చేయడం కోసం గంటన్నర సమయం పడుతుంది” అని తెలిపాడు. అనిల్ కుమార్ సాహు రూపొందించిన ఈ గడియారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి