iDreamPost
android-app
ios-app

వీడియో: అయోధ్య రాముడి కోసం దండుగా కదిలిన మారిషస్.. చూస్తే గూస్​బంప్స్ పక్కా!

  • Published Jan 22, 2024 | 3:09 PM Updated Updated Jan 22, 2024 | 3:20 PM

Ayodhya Ram Mandhir Car Rally Video: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఎక్కడ చూసినా శ్రీరామ నామమే వినిపిస్తోంది. మన దేశంలోనే కాదు ఇతర దేశాలు కూడా రామనామంతో మారుమోగుతున్నాయి. దీనికి ఈ వీడియోనే సాక్ష్యం.

Ayodhya Ram Mandhir Car Rally Video: అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఎక్కడ చూసినా శ్రీరామ నామమే వినిపిస్తోంది. మన దేశంలోనే కాదు ఇతర దేశాలు కూడా రామనామంతో మారుమోగుతున్నాయి. దీనికి ఈ వీడియోనే సాక్ష్యం.

  • Published Jan 22, 2024 | 3:09 PMUpdated Jan 22, 2024 | 3:20 PM
వీడియో: అయోధ్య రాముడి కోసం దండుగా కదిలిన మారిషస్.. చూస్తే గూస్​బంప్స్ పక్కా!

శ్రీరాముడు.. ఈ పేరు వింటేనే కోట్లాది మంది హిందువుల హృదయాలు పులకించిపోతాయి. జై శ్రీరామ్ అనేది ఓ నినాదం మాత్రమే కాదు.. భక్త కోటికి ఇదో ఎమోషన్. అలాంటి అయోధ్యను ఏలిన రఘుకుల తిలకుడి ఆలయ ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. వందల ఏళ్ల నాటి కలను నిజం చేస్తూ భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంబరాన్నంటింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమాన్ని కనులారా చూసేందుకు లక్షలాది మంది అయోధ్యకు చేరుకున్నారు. భవ్య మందిరంలో కొలువుదీరిన బాలరాముడ్ని చూసి యావత్ భారతం పులకించిపోయింది. మన దేశమే కాదు.. ఇతర దేశాలూ రామ నామస్మరణతో మారుమ్రోగాయి. భారతీయులు ఎక్కువగా ఉండే యూఎస్, యూకే లాంటి దేశాల్లో సంబురాలు మిన్నంటాయి. ఆఫ్రికా దేశమైన మారిషస్​లో అయితే ప్రజలు దండుగా కదిలారు. వందలాది కార్లతో రథయాత్రను నిర్వహించారు.

అయోధ్యలో రామాయల ప్రారంభోత్సవం సందర్భంగా మారిషస్​లో ఉంటున్న భారతీయులు సంతోషంతో ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. వందలాది కార్లతో భారీగా రథయాత్ర నిర్వహించారు. ఆంజనేయుడి జెండాలను ప్రదర్శిస్తూ, జైశ్రీరామ్ నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇది ఇండియాలోని ఏదైనా సిటీ అనుకొని పొరబడేరు.. కాదు, ఇది మారిషస్ అంటూ ఈ వీడియోలను షేర్ చేస్తున్నారు రామ భక్తులు. దీన్ని చూసిన నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీడియో చూస్తుంటే గూస్​బంప్స్ వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. విదేశాల్లో ఉంటున్నా దైవభక్తిని, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోకపోవడం గ్రేట్ అని చెబుతున్నారు. మారిషస్​తో పాటు అమెరికాలో భారతీయులు సెలబ్రేట్ చేసుకుంటున్న వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

యూఎస్​లోని టైమ్స్ స్క్వేర్ దగ్గర వందలాది మంది భారతీయులు గుమిగూడారు. హనుమాన్ జెండాలను పట్టుకొని జైశ్రీరామ్, జై హనుమాన్ నినాదాలు చేశారు. మారిషస్, అమెరికాలో భారతీయులు జైశ్రీరామ్ అంటూ నినదిస్తూ తీసిన వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇక, రామాలయ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన రాముడు మళ్లీ వచ్చాడని అన్నారు. ‘మన రాముడు మళ్లీ వచ్చాడు. ఎన్నో బలిదానాలు, త్యాగాల అనంతరం ఆయన వచ్చాడు. ఈ శుభ ఘడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు. గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించాం. ఇక నుంచి బాల రాముడు టెంట్​లో ఉండాల్సిన అవసరం లేదు. రామ్ లల్లా గుడిలో ఉంటాడు. 2024 జనవరి 22 అనేది సాధారణ తేదీ కాదు.. ఇది కొత్త కాలచక్రానికి ప్రతీక’ అని మోడీ చెప్పుకొచ్చారు. మరి.. భారత్​తో పాటు విదేశాల్లో కూడా రామనామం మారుమ్రోగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.