iDreamPost
android-app
ios-app

అయోధ్య వాసులకు బ్యాడ్ న్యూస్.. రామయ్య ఊరేగింపు రద్దు!

Ayodhya Ram Idol: అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది కోట్లాది మంది భక్తుల కల. ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఆ కల మరికొద్ది రోజుల్లో తీరనుంది. ఈ నేపథ్యంలోనే అయోధ్య వాసులకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

Ayodhya Ram Idol: అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది కోట్లాది మంది భక్తుల కల. ఏళ్ల తరబడి ఎదురు చూసిన ఆ కల మరికొద్ది రోజుల్లో తీరనుంది. ఈ నేపథ్యంలోనే అయోధ్య వాసులకు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ఓ బ్యాడ్ న్యూస్ చెప్పింది.

అయోధ్య వాసులకు బ్యాడ్ న్యూస్.. రామయ్య ఊరేగింపు రద్దు!

అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువుల కలగా వస్తుంది. కొన్ని దశాబ్దాలుగా రామమందిర నిర్మాణం గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. అయోధ్య నిర్మాణానికి ఉన్న అడ్డంకులు 2019లో సుప్రీం కోర్టు తొలగించింది. దీంతో  రామమందిర నిర్మాణం ప్రారంభమై శరవేగంగా పూర్తైంది. ఇక జనవరి 22వ తేదిన అయోధ్య రామ మందిరంలో రాములోరికి ప్రాణ ప్రతిష్టా కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకను చూసేందుకు దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అయోధ్య వాసులకు  ఓ విషయంలో బ్యాడ్ న్యూస్ వచ్చింది. అది ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

దశాబ్దకాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. మరికొన్ని రోజుల్లో రామయ్య తండ్రి తన జన్మస్థానంలో కొలువు తీరబోయే సమయం ఆసన్నమైంది. ఆ ఆద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు కోట్లాది మంది ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఎంతో కన్నుల పండుగగా జరగనున్న రామ మందిర ప్రతిష్టాపన కోసం భక్తులంతా అయోధ్య వైపే చూస్తున్నారు. ఇక ఈ రామ మందిరం ప్రారంభోత్సవాన్ని జనవరి 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగానుంది. జనవరి 14 నుంచి 22 వరకు  అయోధ్యలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య వాసులకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది.

రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 17వ తేదీన అయోధ్యలో  కొలువుదీరనున్న శ్రీరాముడి విగ్రహాన్ని అయోధ్య నగరంలో ఊరిగేంచాలని నిర్ణయించారు. అయితే ఈ ఊరేంపు రద్దు చేయడానికి గల కారణాలను కూడా ట్రస్ట్ వెల్లడించింది. అయోధ్య గర్భగుడిలో ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న బాల రాముడి రూపంలో ఉన్న శ్రీరాముడి విగ్రహ ఊరేగింపును రద్దు చేసినట్లు తెలిపింది. రామ మందిర ప్రారంభోత్సవ వేడుక జరగనున్న నేపథ్యంలో నగరానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారని  ట్రస్ట్ భావించింది. భక్తుల రద్దీ కారణంగానే ఉన్నతాధికారుల సూచనలతో ఊరేగింపు కార్యక్రమాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ వెల్లడించింది.

భారీగా తరలివస్తున్న భక్తుల మధ్యలో నుంచి రాముడి ఊరేగింపు జరిపితే భద్రతా పరంగా సమస్యలు తలెత్తుతాయని అధికారులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఊరేంపు రద్దు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ట్రస్ట్ పేర్కొంది. అయితే అదే రోజున రామజన్మభూమి ప్రాంగణంలో ఆ బాల రాముడి కొత్త విగ్రహాన్ని ప్రదర్శిస్తామని తెలిపారు.  శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంతో అయోధ్య వీధుల్లో రాముడి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఆశిస్తున్న నగర వాసులకు నిరాశే ఎదురైంది. మరి.. అయోధ్య ట్రస్ట్ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.