iDreamPost
android-app
ios-app

అయోధ్యను పోలిన మరో అయోధ్య.. ఎక్కడుందంటే?

అయోధ్యా నగరంలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగనున్నది. అయితే అయోధ్యను పోలిన మరో అయోధ్య ఉంది. ఇంతకీ ఆ అయోధ్య ఎక్కడ ఉంది. దాన్ని ఎవరు స్థాపించారు. ఆ వివరాలు మీకోసం..

అయోధ్యా నగరంలో రామ్ మందిర్ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరుగనున్నది. అయితే అయోధ్యను పోలిన మరో అయోధ్య ఉంది. ఇంతకీ ఆ అయోధ్య ఎక్కడ ఉంది. దాన్ని ఎవరు స్థాపించారు. ఆ వివరాలు మీకోసం..

అయోధ్యను పోలిన మరో అయోధ్య.. ఎక్కడుందంటే?

ఎన్నో ఏళ్ల నుంచి రామ భక్తులు ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 22న రామ్ మందిర్ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది. రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయోధ్యలో కొలువు దీరనున్న శ్రీరాముడిని దర్శన భాగ్యం కోసం యావత్ దేశం ఉత్సాహంతో ఎదురు చూస్తోంది. కాగా ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య నగరం మనందరికి తెలిసిందే. కానీ అయోధ్యను పోలిన మరో అయోధ్య కూడా ఉంది. కానీ అది మన దేశంలో కాదు.. థాయ్ లాండ్ దేశంలో. మరి థాయ్ లాండ్ లో అయోధ్యను ఎవరు స్థాపించారు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామ్ మందిర్ లో కోదండ రాముడు కొలువుదీరనున్నారు. దీంతో రామ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రామ నామంతో దేశమంతా మారు మ్రోగుతోంది. ఇప్పటికే అయోధ్యా నగరం అత్యంత సుందరంగ ముస్తాబైంది. విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత్ లోనే కాకుండా థాయిలాండ్ దేశంలోనూ ఒక అయోధ్య ఉంది. ఈ నగరాన్ని అక్కడ ఆయుతయ అని పిలుస్తారు. ఈ ప్రాంతానికి అయోధ్యకు దగ్గరి పోలికలున్నాయి. అయుతయ రాజవంశంలోని ప్రతి రాజునూ శ్రీరాముని అవతారంగా కొలుస్తారు. రాజుల పేరులో రామ అనే పదాన్ని చేర్చుకోవడం ఇక్కడి తరతరాల సంప్రదాయం. థాయ్ ప్రజలు ఆనాటి నుంచే శ్రీరామున్ని పూజించేవారని తెలుస్తోంది.

ఆయుతయ నరగ స్థాపన

థాయిలాండ్ వెళ్లిన భారతీయ యాత్రికులకు ఈ ఆయుతయ నగరం అయోధ్యను చూసిన భావన కలిగేలా చేస్తుంది. ఈ నగరాన్ని 1351లో రామతిబోడి అనే రాజు స్థాపించాడు. నాలుగు శతాబ్దాలకు పైగా ఆయుతయ నగరం థాయిలాండ్ కు రెండవ రాజధానిగా కొనసాగింది. రామాయణం ఆదారంగా ఆయుతయ మొదటి పాలకుడు రామతిబోడి ఈ నగరానికి ఆ పేరు పెట్టినట్టు చరిత్రకారులు తెలిపారు. హిందూ ఇతిహాసాల్లోని రామాయణంలాగే థాయ్‌లాండ్‌ రామాయణం పేరు రామకియాన్‌. దీన్ని 18వ శతాబ్దంలో.. కింగ్‌ రామ ఒన్ రచించారని నమ్ముతారు. అక్కడ ఉన్న బౌద్ధ మిషనరీలు రామాయణాన్ని రామకీన్ అనే పేరుతో థాయిలాండ్ భాషలోకి అనువదించాయి. అయుతయ నగరాన్ని 1767లో బర్మా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. మరి రామ భక్తులకు తెలియని రామరాజ్యంగా వెలుగొందుతున్న థాయ్ లాండ్ లోని ఆయుతయ నగరంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.