iDreamPost
android-app
ios-app

కోల్‌కతా తరహాలో మరో ఘటన..నర్సింగ్ విద్యార్థిపై ఆటో డ్రైవర్ దారుణం!

Auto Driver Attacks On Nursing Student: ఓవైపు కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై దేశమంతటా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ ... మరో ప్రాంతంలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

Auto Driver Attacks On Nursing Student: ఓవైపు కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై దేశమంతటా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ ... మరో ప్రాంతంలో నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

కోల్‌కతా తరహాలో మరో ఘటన..నర్సింగ్ విద్యార్థిపై ఆటో డ్రైవర్ దారుణం!

ఇటీవల కోల్ కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా సంచలనమైంది. అంతేకాక ఈ ఘటనలో ఎన్నో ఆశ్చర్యకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక మృతురాలి కుటుంబానికి న్యాయం జరగాలంటూ దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ లు వినిపించాయి. ఈ ఘటన మరువక ముందే ఇదే తరహాలో మహారాష్ట్రలో మరో ఘటన చోటుచేసుకుంది. మత్తుమందు కలిపిన నీళ్లను ఇచ్చి..అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలోని ఓ విద్యార్థిని నర్సింగ్  విద్యను చదువుతోంది. సోమవారం కాలేజీ నుంచి ఆ విద్యార్థిని ఇంటికి బయలు దేరింది. అదే సమయంలో అటుగా వచ్చిన ఆటోలో ఎక్కింది. ఈ క్రమంలోనే ఆ ఆటో డ్రైవర్ సదరు విద్యార్థినితో మాటలు కలిపాడు. దీంతో అతడి మాటలు మంచిగా ఉండటంతో డ్రైవర్ ను విద్యార్థిని పూర్తిగా నమ్మింది. ఈ క్రమంలోనే ఈ విద్యార్థి నీళ్లు అడిగింది. అయితే అప్పటికే అందులో మత్తు మందు కలిపి ఉంచాడు. ఆ నీటిని విద్యార్థికి ఆటోడ్రైవర్ ఇచ్చాడు.

మత్తు మందు కలిపిన నీటిని తాగిన యువతి… కాసేపటికే స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత యువతితో ఆటోను అటవీ ప్రాంతానికి డ్రైవర్ తీసుకెళ్లాడు. అనంతరం స్పృహలో లేని  ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తీవ్రంగా గాయపడిన యువతిని అడవిలోనే వదిలేసి పరారయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని అటుగా వెళ్తున్న స్థానికులు గుర్తించారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికిత తీసుకెళ్లి చికిత్స అందించారు. స్పృహలోకి వచ్చిన తరువాత తనపై అత్యాచారం జరిగినట్లు విద్యార్థిని గుర్తించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ ను పట్టుకుని, కఠినంగా శిక్షించాలని  డిమాండ్ చేస్తూ బాధితురాలి కుటుంబంతో పాటు వైద్యులు, నర్సులు, నర్సింగ్ కాలేజీ  విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఓవైపు కోల్ కతా వైద్యురాలి హత్యాచారంపై దేశమంతటా నిరసనలు వ్యక్తం అవుతున్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో మహారాష్ట్రలోని రత్నగిరిలో ఉద్రిక్తత నెలకొంది. మరి.. ఇలాంటి దారుణ ఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.