వీడియో: ఎగ్జామ్ రాస్తున్న చెల్లికి అన్నయ్య స్లిప్ లు! అడ్డుకున్న పోలీస్ పై దాడి!

వీడియో: ఎగ్జామ్ రాస్తున్న చెల్లికి అన్నయ్య స్లిప్ లు! అడ్డుకున్న పోలీస్ పై దాడి!

ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు విధుల్లో ఉండే పోలీసులతో ఘర్షణ పడుతుంటారు. అలానే ఓ యువకుడు పోలీస్ కానిస్టేబుల్ తో వాగ్వాదం పెట్టుకుని చివరకు అరెస్టు అయ్యాడు.

ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొందరు విధుల్లో ఉండే పోలీసులతో ఘర్షణ పడుతుంటారు. అలానే ఓ యువకుడు పోలీస్ కానిస్టేబుల్ తో వాగ్వాదం పెట్టుకుని చివరకు అరెస్టు అయ్యాడు.

ప్రస్తుతం పరీక్షల కాలం నడుస్తోంది. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతం పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే.. పరీక్షల కోసం  విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుతుంటారు. కొందరు మాత్రం చీటీలు పెట్టుకుని రాసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొందరి విద్యార్థుల బంధువులు కాపీలు అందించేందుకు పరీక్ష కేంద్రాల వద్దకు వస్తుంటారు. అలా వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా అక్కడ విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై దాడికి దిగాడు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది.

కర్ణాటక రాష్ట్రంలోని అప్జల్ పూర్ ప్రాంతంలో కైలాస్ అనే యువకుడు కుటుంబంతో  కలిసి నివాసం ఉంటున్నాడు. అతడి సోదరి స్థానిక కాలేజీలో పీయూ చదువుతుంది. ఆమె చదువులు కాస్తా వెనుకబడి ఉంది. అందుకే తన చెల్లిని ఎలాగైన పాస్ చేయాలని ఆమె సోదరుడు నిశ్చయించుకున్నాడు. ఈక్రమంలోనే ఇటీవలే కర్నాటక రాష్ట్రంలో పీయూ పరీక్షలు ప్రారంభమయ్యాయి.  ఈ నేపథ్యంలోనే తన చెల్లికి కాఫీలు అందించాలని కైలాస్ భావించాడు. పరీక్ష రాస్తున్న తన చెల్లికి కాపీలు  అందించేందుకు ఎగ్జామ్ సెంటర్ కి వెళ్లాడు. తన స్నేహితుడి తో కలిసి కైలాశ్ పరీక్ష కేంద్ర వద్దకు వెళ్లాడు. తన చెల్లి ఉండే గదివైపు వెళ్లేందుకు ప్రయ్నతించాడు. అయితే వారిద్దని లోపలికి అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కానిస్టేబుల్ అనుమతించలేదు.

అయితే  కానిస్టేబుల్ ను దాటుకునే వెళ్లే ప్రయత్నం చేశాడు కైలాశ్. అయినా పోలీసులు వాళ్లిద్దరిని పరీక్ష కేంద్రం లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాడు. అయితే ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన కైలాశ్..అడ్డుకున్న కానిస్టేబుల్ పై దాడి చేశాడు. స్నేహితుడితో కలిసి కైలాశ్ రెచ్చిపోయి కానిస్టేబుల్ పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. కష్టపడి చదవమని చెప్పేది పోయి.. ఇంకా చీటీలు అందించడానికి వెళ్లడం ఏంటని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోకసారి జరగకుండా చూసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇక పోలీస్ కానిస్టేబుల్  పై దాడి చేసిన  ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments