రోడ్లెక్కిన టెకీలు.. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంతో

ప్రస్తుతం ఐటీలో గడ్డు కాలం నడుస్తోంది. బడా సంస్థలు సైతం టెకీలను ఇంటికి సాగనంపుతున్నాయి. భీభత్సమైన లే ఆఫ్స్ ఉన్నాయి. దీంతో రోడ్డున పడుతున్నారు. తాజాగా..

ప్రస్తుతం ఐటీలో గడ్డు కాలం నడుస్తోంది. బడా సంస్థలు సైతం టెకీలను ఇంటికి సాగనంపుతున్నాయి. భీభత్సమైన లే ఆఫ్స్ ఉన్నాయి. దీంతో రోడ్డున పడుతున్నారు. తాజాగా..

దేశంలో రెసిషన్ పిరీయడ్ నడుస్తోంది. దీంతో ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి పలు కంపెనీలు. ముఖ్యంగా ఐటీ సెక్టారులో లే ఆఫ్స్‌తో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. అలాగే మొన్నటి వరకు వర్క్ ఫ్రం అలవాటు చేసిన బడా కంపెనీలు.. ఇప్పుడు సంస్థలకు వచ్చి పనిచేయాలంటూ తమ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నాయి. కొత్త కొలువులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులకు వెళుతున్నారు ఐటీ ఎంప్లాయిస్. ఉద్యోగంలో చిన్న తప్పు చేసినా పింక్ స్లిప్ ఇచ్చేసేందుకు రెడీ అయిపోతున్నాయి టెక్ కంపెనీలు. ప్రస్తుతం ఐటి ఉద్యోగులకు గడ్డుకాలమనే చెప్పొచ్చు. ఈ క్రమంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మరోసారి రోడ్లు ఎక్కి ఆందోళన చేపడుతున్నారు. ఇంతకు ఎక్కడంటే..?

కర్ణాటకలోని బెంగళూరులో ఐటీ, ఐటీఈఎస్ ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. మార్చి 16 నుండి ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రంలో తీసుకు వచ్చిన ఇండస్ట్రీయల్ ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) ఇందుకు కారణమైంది. దీంతో లేబర్ కమిషన్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఇంతకు ఆ చట్టం ఏం చేసిందంటే.. ఐటీ, ఐటీఈఎస్ సెక్టార్ ఉద్యోగులను ఈ చట్టం కింద మినహాయించింది. ఈ మినహాయింపుకు వ్యతిరకంగా  కర్ణాటక స్టేట్ IT/ITeS ఎంప్లాయీస్ యూనియన్ (KITU)ఈ ఉద్యమం చేస్తోంది. ఐటీ, ఐటీఈఎస్ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, నాల్డెడ్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సంస్థలకు కార్మిక నిబంధల నుండి కర్ణాటక మినహాయింపులు మంజూరు చేసింది.

2014లో ఇండస్ట్రీయల్ ఎంప్లాయిమెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) 1946 నుండి కంపెనీలకు మినహాయింపు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మినహాయింపు 2019లో ఐదేళ్ల పాటు పొడిగించింది కర్ణాటక ప్రభుత్వం. ఇదే వ్యతిరేకతకు కారణమైంది. కర్ణాటకలో 20 లక్షల మంది ఐటీ ఎంప్లాయిస్ ఉండగా.. ఇప్పటి వరకు వారిని ఈ యాక్ట్ కింద మినహాయిస్తూ.. టెక్ ఉద్యోగులమైన తమను విస్మరించారని, అన్యాయం చేశారని ఆవేదన వ్యకం చేస్తూ ఆందోళన చేస్తున్నారు. ఈ మినహాయింపును సవాల్ చేస్తూ కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయిస్ యూనియన్ కూడా కర్ణాటక రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ విభాగంలోని కంపెనీలను రాష్ట్ర కార్మిక శాఖ పరిధిలోకి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Show comments