iDreamPost
android-app
ios-app

Apple Awas Yojana: ఉద్యోగులకు యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. అందరికీ సొంతిల్లు!

ఇటీవల కాలంలో ఉద్యోగులు చేస్తున్న పనికి కేవలం జీతం ఇవ్వడమే కాకుండా వారికి మౌలికసదుపాయాలు కల్పించడంపై ప్రముఖ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈక్రమంలోనే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఇటీవల కాలంలో ఉద్యోగులు చేస్తున్న పనికి కేవలం జీతం ఇవ్వడమే కాకుండా వారికి మౌలికసదుపాయాలు కల్పించడంపై ప్రముఖ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఈక్రమంలోనే ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Apple Awas Yojana: ఉద్యోగులకు యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. అందరికీ సొంతిల్లు!

సాధారణంగా చాలా కంపెనీలు.. తమ సంస్థలో పని చేసే ఉద్యోగులకు జీతం మాత్రమే ఇస్తుంటారు. అయితే కొన్ని సంస్థలు మాత్రం ఉద్యోగుల ఆరోగ్యం, ఇతర సౌకర్యాలకు కూడా ప్రాధాన్యాత ఇస్తుంటాయి. ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే కంపెనీ అభివృద్ధి చెందుతుందని పలు కంపెనీలు బలంగా నమ్ముతున్నాయి. అందుకే ఉద్యోగులు చేస్తున్న పనికి కేవలం జీతం మాత్రమే కాకుండా వారికి మౌలికసదుపాయాలు అందించే దిశగా ప్రముఖ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా టెక్ దిగ్గజ కంపెనీ అయిన యాపిల్‌ తన ఉద్యోగులకు ఏకంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు కొన్ని మీడియాల్లో కథనాల ద్వారా తెలుస్తోంది.

ఇక కొన్ని మీడియా కథనాల్లో తెలిపిన వివరాల ప్రకారం..ఉద్యోగులకు ఇళ్లను నిర్మించి ఇవ్వాలని పలు సంస్థలు ఆలోచిస్తున్నాయి. ఇండస్ట్రీయల్‌ హౌజింగ్‌ మోడల్స్‌ పేరుతో ఇప్పటికే చైనా, వియత్నాం వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇదే ఈ విధానాన్ని భారత్‌లో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ యాపిల్ సంస్థ గడిచిన రెండున్నరేళ్లలో భారత్ లో 1.5 లక్షల మందిని తమ సంస్థలోకి తీసుకున్నట్లు సదరు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఉద్యోగులకు ఇళ్లు నిర్మించేలా కంపెనీ చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. భారత్‌లో యాపిల్‌ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌, సాల్‌కాంప్‌ వంటి సంస్థలు తమ ఉద్యోగుల కోసం గృహాలను నిర్మించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపాయి.

ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య పద్ధతితో ‘యాపిల్‌ ఆవాస్‌ యోజన’ పేరుతో గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు కొన్ని వార్త కథనాల ద్వారా తెలిసింది. ఈ స్కీమ్ కింద దాదాపు 78,000 యూనిట్ల ఇండ్లను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో గరిష్ఠంగా తమిళనాడులోనే 58,000 యూనిట్ల ఇళ్ల నిర్మాణం జరగనుంది. స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు సహకారంతో ఆ రాష్ట్రంలో ఇళ్లు నిర్మిస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 2025 మార్చి 31 నాటికి  ఈ ఇళ్ల నిర్మాణాలు పూరత్ చేసేలా  టార్గెట్ గా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక యాపిల్ కంపెనీ తీసుకొచ్చిన ఈ స్కీమ్ ద్వారా ఎక్కువగా మహిళలకు లబ్ధి చేకూరనుందని అధికారులు పేర్కొన్నారు. చాలా మంది  ఉద్యోగులు అద్దె గృహాల్లో ఉంటున్నారు. వారు ఆఫీస్ లకు చేరుకోవడానికి చాలాసమయం ప్రయాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళ ఉద్యోగులు భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అందుకే కంపెనీ ప్రొడక్షన్ తోపాటు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

యాపిల్ ఫోన్ బాటలోనే ప్రముఖ ఫోన్ల కంపెనీ సంస్థ ఫాక్స్ కాన్ కూడా వెళ్తున్నట్లు సమాచారం. తన సంస్థలోని 41,000 మంది ఉద్యోగుల కోసం 35 వేల ఇళ్లను నిర్మించనుంది. టాటా ఎలక్ట్రానిక్స్ తన ఉద్యోగుల కోసం బెంగళూరులోని హోసూర్ ఫెసిలిటీలో 11,500 గృహాలను నిర్మిస్తుంది. యాపిల్‌ కోసం పవర్ అడాప్టర్‌లు, ఎన్‌క్లోజర్‌లను ఉత్పత్తి చేసే సాల్‌కాంప్‌ కంపెనీ కూడా 3,969 యూనిట్ ఇల్లలను ఏర్పాటు చేయనుంది. మరి.. పలు సంస్థలు తమ ఉద్యోగాలుక ఇళ్లను ఇవ్వనున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.